ETV Bharat / sports

బ్యాటింగైనా బౌలింగైనా 'దేనికైనా రెడీ'.. అశ్విన్​తో మామూలుగా ఉండదు మరి.. - ఇండియా బంగ్లా టెస్టు సిరీస్​

బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టులో టీమ్​ఇండియాను గట్టెక్కించారు రవిచంద్రన్​ అశ్విన్​​, శ్రేయస్ అయ్యర్​​. కఠినమైన పరిస్థితుల్లో బంగ్లా బౌలర్ల దాడిని తట్టుకుని భారత్ ఓడిపోకుండా కాపాడారు. 2-0తో టెస్టు సిరీస్​ సొంతం చేసుకున్న భారత జట్టు నవ్వులతో పర్యటనను ముగించింది.

Aswin Shreyas Partnership
రవిచంద్రన్​ అశ్విన్​ శ్రేయస్​ అయ్యర్​
author img

By

Published : Dec 26, 2022, 3:53 PM IST

రవిచంద్రన్​ అశ్విన్​.. భారత క్రికెట్​ జట్టులో సీనియర్​ బౌలర్​. టీమ్​ఇండియాకు అవసరమైనప్పుడు బ్యాటర్​ అవతారమూ ఎత్తుతుంటాడు. తాజాగా బంగ్లాదేశ్​తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్​లో ఓటమి తప్పదనుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్..​ తన బ్యాటింగ్​తో ఆదుకున్నాడు. శ్రేయస్​ అయ్యర్​(29*)తో కలిసి​.. అద్భుతంగా 71 పరుగుల భాగస్వామ్యం నిర్మించి భారత్​కు విజయాన్ని అందించాడు. దీంతో ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు. కాగా.. 9వ బ్యాటర్​గా వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్​ సాధించిన ఆటగాడిగా అశ్విన్​(42 నాటౌట్​) రికార్డు సృష్టించాడు. గతంలోనూ ఇలా అశ్విన్​.. తనదైన శైలి బ్యాటింగ్​తో భారత్​ను ఆదుకున్నాడు. 2021లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలకమైన మూడో టెస్టులో జట్టును ఓటమి నుంచి కాపాడాడు. ఆ మ్యాచ్​లో 7వ స్థానంలో దిగిన అశ్విన్​(39*:128 బంతులు), విహారి(23*:161 బంతులు)తో కలిసి దాదాపు 44 ఓవర్లు క్రీజు​లో పాతుకుపోయాడు. ఆసీస్​తో ఆ మ్యాచ్​ డ్రా అవడం, ఆ తర్వాతి టెస్టులో గెలవడంతో సిరీస్​ను భారత్​ సొంతం చేసుకుంది.

Ravichandran Aswin
రవిచంద్రన్​ అశ్విన్​

నిజానికి అశ్విన్​ కెరీర్​ బ్యాటర్​గానే మొదలైంది. తమిళనాడు తరఫున దేశీ క్రికెట్​ ఆడే సమయంలో అశ్విన్​ ఓపెనింగ్​ బ్యాటర్​ కమ్ మీడియం పేస్​ బౌలర్​గా ఉండేవాడు. తన కోచ్​ సీకే విజయ్​ సూచనతో ఆఫ్​ స్పిన్నర్​గా మారాడు. అక్కడి నుంచి అశ్విన్​ దశ మారింది. దేశీయ క్రికెట్​లో సత్తా చాటి జాతీయ జట్టులోకి వచ్చాడు. టీమ్​ఇండియా సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అశ్విన్​ మొత్తంగా 88 టెస్ట్ మ్యాచ్​లు ఆడి..449 వికెట్లు పడగొట్టాడు. 3043 పరుగులు చేశాడు. అతి తక్కువ మ్యాచ్​లలో 400 వికెట్లు, 3 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఘనత సాధించాడు.​

Shreyas Ayyar
శ్రేయస్​ అయ్యర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.