టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్లో కొత్త నిబంధన కోసం ఓ ప్రతిపాదన చేశాడు. బౌలర్ బంతి వేయకముందే, రన్నర్ క్రీజును వదిలితే.. బౌలర్‌కు ఫ్రీ బాల్‌ను ఇవ్వాలని కోరాడు. అంతకుముందు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ఓ ట్వీట్‌కు బదులుగా ఈ ట్వీట్‌ను చేశాడు అశ్విన్.
"సంజయ్ మంజ్రేకర్.. ఫ్రీ హిట్ అనేది ఈ రోజుల్లో గొప్ప మార్కెటింగ్ సాధనంగా ఉంది. ఇది అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. ఇక బౌలర్లకు ఒక ఫ్రీ బాల్ ఇవ్వమని అడగండి. నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్.. బౌలర్ బంతిని వేయడానికి ముందే క్రీజును వదిలి ముందుకు వెళితే ఫ్రీ బాల్ ఇవ్వాలి. ఈ బంతికి కనుక వికెట్ పడితే ప్రత్యర్థి స్కోరు బోర్డు నుంచి 10 పరుగులు తగ్గించాలి," అని అశ్విన్ ట్వీట్ చేశాడు.
"గుర్తుంచుకోండి.. బంతిని వేశాకే, నాన్‌స్ట్రైకర్ క్రీజును వదలాలి" అని అశ్విన్ పేర్కొన్నాడు.
-
Remember: “you are supposed to leave the crease only after the ball leaves the hand”
— Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Remember: “you are supposed to leave the crease only after the ball leaves the hand”
— Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 28, 2021Remember: “you are supposed to leave the crease only after the ball leaves the hand”
— Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) May 28, 2021
అంతకముందు సంజయ్ మంజ్రేకర్.. ఫ్రీ హిట్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయంపై తనకు ట్విట్టర్లో ఎంతమంది మద్దతుగా నిలుస్తారో చెప్పాలని అడిగాడు.
ఇదీ చదవండి: 'ఆ లక్షణాలు పంత్‌లో చాలా ఉన్నాయి'