ETV Bharat / sports

'ధోనీ టెస్టు రిటైర్మెంట్ నిర్ణయంతో షాక్​కు గురయ్యాం' - ధోనీ రిటైర్మెంట్​పై రవిశాస్త్రి

Ravishastri Dhoni: టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోనీ అనూహ్యంగా 2014లో టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్ పరిస్థితిని తాజాగా వివరించాడు మాజీ కోచ్ రవిశాస్త్రి. మహీ నిర్ణయంతో తామంతా షాక్​కు గురయ్యామని తెలిపాడు.

MS Dhoni test retirment, ravishastri msdhoni, ధోనీ టెస్టు రిటైర్మెంట్. ధోనీ రిటైర్మెంట్ గురించి రవిశాస్త్రి
MS Dhoni
author img

By

Published : Dec 27, 2021, 12:42 PM IST

Ravishastri Dhoni: 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా టెస్టు క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు అప్పటి సారథి ఎంఎస్ ధోనీ. నాలుగు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో మూడో టెస్టు ముగిశాక మహీ వీడ్కోలు పలికాడు. ఈ మ్యాచ్​ డ్రాగా ముగిసింది. తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లోని పరిస్థితిని వివరిస్తూ.. అప్పటి సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నాడు టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి. ధోనీ అప్పటికే అలసిపోయాడని దీంతో అతడు సుదీర్ఘ ఫార్మాట్​కు వీడ్కోలు పలకాలని నిశ్చయించుకున్నాడని వెల్లడించాడు.

"విరాట్ కోహ్లీ భవిష్యత్ కెప్టెన్​ అని ధోనీకి ముందే తెలుసు. మూడో టెస్టు ముగిశాక ధోనీ నా దగ్గరకు వచ్చి 'బాయ్స్​కు(సహ ఆటగాళ్లు) నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నా' అని అన్నాడు. నేను 'తప్పకుండా' అన్నా. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం గురించి మాట్లాడతాడేమో అనుకున్నా. కానీ ఒక్కసారిగా ధోనీ రిటైర్మెంట్ విషయం వెల్లడించాడు. దీంతో అందరూ షాకయ్యారు."

-రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ కోచ్

Dhoni Test Retirement: 2011 నుంచి కొంతకాలం టీమ్ఇండియా దారుణంగా విఫలమైంది. 2011/12 సీజన్​లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా చేతిలో వైట్ వాష్​కు గురైంది. ఇంగ్లాండ్ చేతిలో 2014లోనూ సిరీస్ ఓటమి చవిచూసింది. తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి అప్పటికే టెస్టు సిరీస్​లో 2-0 లీడ్​తో కొనసాగుతోంది ఆస్ట్రేలియా. ఈ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడని అభిమానులు అనుకుంటున్నారు.

టెస్టు క్రికెట్​కు గుడ్​బై చెప్పాక 2017 వరకు పరిమిత ఓవర్ల జట్టుకు సారథ్యం వహించాడు ధోనీ. ఆ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించగా.. మహీకి డిప్యూటీగా ఉన్న కోహ్లీ పరిమిత ఓవర్ల జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు.

ఇవీ చూడండి: IND vs SA Test: రాహుల్ మరో ఘనత.. పుజారా చెత్త రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.