ETV Bharat / sports

'ఈ గందరగోళం నుంచి నా దేశాన్ని కాపాడండి' - క్రికెటర్​ రషీద్​ ఖాన్​

అఫ్గానిస్థాన్​(Afghanistan)లో యుద్ధ వాతావరణంపై ఆ దేశ క్రికెటర్​ రషీద్​ ఖాన్​(Rashid Khan) స్పందించాడు. భద్రతా బలగాలు, తాలిబన్​ల మధ్య జరగుతున్న భీకర పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు విడుస్తున్నారని ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితుల నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేశాడు.

Rashid Khan urges 'world leaders' to 'stop destroying Afghanistan'
Rashid Khan: ఈ గందరగోళం నుంచి నా దేశాన్ని కాపాడండి
author img

By

Published : Aug 11, 2021, 11:24 AM IST

అఫ్గానిస్థాన్‌(Afghanistan)లో భద్రతా బలగాలు, తాలిబన్‌ల మధ్య భీకర పోరులో రక్తం ఏరులై పారుతోంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో తమ దేశం పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ దేశ రాజకీయ నాయకులకు సూచించాడు క్రికెటర్​ రషీద్​ ఖాన్​(Rashid Khan). ఈ పరిస్థితుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని.. ప్రజలను గందరగోళంలో పడేయొద్దని రాజకీయ ప్రముఖులను కోరాడు.

"ప్రియమైన ప్రపంచ నాయకులారా! నా దేశం తీవ్రమైన గందరగోళంలో ఉంది. పిల్లలు, మహిళలు సహా రోజుకు వేలాది మంది అమాయక ప్రజలు బలవుతున్నారు. గృహ సముదాయాలూ ధ్వంసమవుతున్నాయి. వేలాది కుటుంబాలు వలస వెళుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా దేశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అప్ఘాన్ ప్రజలను చంపడం ఆపండి, మా దేశాన్ని ధ్వంసం చేయడం మానుకోండి. మాకు శాంతి కావాలి."

- రషీద్​ ఖాన్​, అఫ్గానిస్థాన్​ క్రికెటర్​

రషీద్​ ఖాన్​.. ప్రస్తుతం 'ది హండ్రెడ్​' ఆరంభ సీజన్​లో ఆడుతున్నాడు. ఈ సీజన్​లో ట్రెంట్​ రాకెట్స్​ టీమ్​కు రషీద్​ ఖాన్​ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఐపీఎల్​ సెకండ్​ లెగ్​లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్తాడు. ఐపీఎల్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ టీమ్​లో కొనసాగుతున్నాడు రషీద్​ ఖాన్​.

ఇదీ చూడండి.. 'వైమానిక దాడుల్లో 572 మంది తాలిబన్ల హతం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.