Ranji trophy 2022 schedule: రంజీ ట్రోఫీ.. ఐపీఎల్‌కు ముందు, తర్వాత రెండు షెడ్యూల్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ, గురువారం సంబంధిత తేదీలను వెల్లడించారు. ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు బీసీసీఐ సెక్రటరీ జైషా లేఖలు పంపించారు. తొమ్మిది వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా రంజీ తొలిదశ మ్యాచ్‌లు ఫిబ్రవరి 10-మార్చి 15 వరు, రెండో దశ మే 30 నుంచి జూన్ 26 వరకు జరగనున్నట్లు జైషా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ జట్టు గ్రూప్-ఈలో, హైదరాబాద్ జట్టు ఎలైట్ గ్రూప్-బీలో ఉన్నాయి.
టోర్నీలో ఈసారి ఒక్కో గ్రూపులో ఆరు జట్లు ఉండగా.. ఆ సంఖ్యను నాలుగుకు కుదించి ఎనిమిది గ్రూపులకు పెంచారు. ఈ ట్రోఫీని అహ్మదాబాద్, కోల్‌కతా, త్రివేండ్రం, కటక్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, బరోడా, రాజ్‌కోట్ వేదికల్లో నిర్వహించనున్నారు. దీన్ని బట్టి తొమ్మిది వేర్వేరు బయో బబుల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.
పుజారా, రహానెకు గంగూలీ పరోక్ష హెచ్చరిక
"ఆ ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో ఆడతారని, చాలా పరుగులు చేస్తారని ఆశిస్తున్నాను. వారు తప్పకుండా సాధిస్తారని భావిస్తున్నాను. రంజీ ట్రోఫీ చాలా ముఖ్యమైన టోర్నీ. మేమంతా కూడా ఇందులో పాల్గొన్నాం" అని గంగూలీ.. పుజారా, రహానెలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిబట్టి చూస్తుంటే వీరిద్దరూ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: