ETV Bharat / sports

Ranji trophy 2021: రంజీ ట్రోఫీ గ్రూప్స్​పై బీసీసీఐ ప్రకటన

ఇటీవల దేశవాళీ క్రికెట్​ టోర్నీల షెడ్యూల్​ను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా రంజీ ట్రోఫీ (Ranji trophy 2021) గ్రూప్స్​ వివరాలు వెల్లడించింది. రంజీ ట్రోఫీ ఫైనల్స్​ కోల్​కతాలోను, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్స్​ దిల్లీలోను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

ranji trophy
Ranji trophy 2021: రంజీ ట్రోఫీ గ్రూప్స్​పై బీసీసీఐ ప్రకటన
author img

By

Published : Aug 31, 2021, 10:38 AM IST

దేశవాళీ క్రికెట్​ టోర్నీల్లో ప్రధానమైన రంజీ టోర్నీకి (Ranji trophy 2021) సంబంధించి బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. 2021-22 సీజన్​లో భాగంగా వివిధ రాష్ట్రాల జట్లను ఎలైట్​ గ్రూప్​, ప్లేట్​ గ్రూప్​లలో చేర్చిన వివరాలు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ఈ టోర్నమెంట్​ ప్రారంభం కానుంది.

ఒక్కో గ్రూప్​లో ఆరు టీమ్​లు..

  • ఎలైట్​ గ్రూప్​ 'ఎ'- పంజాబ్​, గుజరాత్​, మధ్యప్రదేశ్, హిమాచల్​ ప్రదేశ్, సర్వీసెస్​, అసోం
  • ఎలైట్​ గ్రూప్​ 'బి'- బంగాల్​, విదర్భ, హరియాణ, కేరళ, త్రిపుర, రాజస్థాన్​
  • ఎలైట్​ గ్రూప్​ 'సి'-ముంబయి, దిల్లీ, కర్ణాటక, హైదరాబాద్​, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్
  • ఎలైట్​ గ్రూప్​ 'డి'- సౌరాష్ట్ర, తమిళనాడు, జమ్ము కశ్మీర్​, రైల్వేస్, గోవా, ఝార్ఖండ్
  • ఎలైట్​ గ్రూప్​ 'ఈ'-ఆంధ్రా, ఉత్తర్​ప్రదేశ్, బరోడా, ఒడిశా, ఛత్తీస్​గఢ్​, పుదిచ్చేరి

ఎనిమిది జట్లు..

  • ప్లేట్​​ గ్రూప్​- చండీగఢ్, మేఘాలయ, బిహార్, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం, అరుణాచల్​ ప్రదేశ్

ఎలైట్​ గ్రూప్​లలో విజేతగా నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్​కు చేరుకుంటాయి. రెండో స్థానంలో నిలిచిన జట్లు.. ప్రీక్వాటర్​ ఫైనల్స్​లో ప్లేట్​ గ్రూప్​ జట్లతో తలపడనున్నాయి.

ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్​, తిరువనంతపురం, చెన్నైలలో ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. ఫైనల్ సహా నాకౌట్​ మ్యాచ్​లు అన్నీ కోల్​కతాలో నిర్వహించనున్నారు. మార్చి 16న ఫైనల్​ జరగనుంది.

మరోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నాకౌట్​ మ్యాచ్​లను దిల్లీలో నిర్వహించనున్నారు. అక్టోబరు 27 నుంచి ప్రారంభమై.. ఈ టోర్నీ నవంబరు 12 వరకు కొనసాగుతుంది.

ఇదీ చూడండి : Ind vs Eng: 'కోహ్లీ నుంచి మార్పులు ఆశించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.