టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) అనంతరం.. టీమ్ఇండియా కోచ్ బాధ్యతలు స్వీకరించాలని మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను(Dravid Coach News) బీసీసీఐ కోరినట్లు సమాచారం. ఈ వినతిని రాహుల్ ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా ప్రధాన్ కోచ్ పదవీ కాలం పూర్తి చేసుకోనున్నాడు రవిశాస్త్రి(ravi shastri news). ఇప్పటికే తాను కోచ్‌గా సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలపడం వల్ల అతడిని మరోసారి కోచ్‌గా ఎంపిక చేసే ఉద్దేశ్యం లేనట్లే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్‌గా వ్యవహరించాలని రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ కోరినట్లు తెలిసింది.
గతంలోనూ..
2016, 2017లోనూ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ ద్రవిడ్‌ను(Rahul dravid new coach) కోరింది బీసీసీఐ. అప్పుడు కూడా ఈ వినతిని సున్నితంగా తిరస్కరించాడు ద్రవిడ్. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు, అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడీ మాజీ క్రికెటర్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్‌గా ఉన్నాడు.
ఇటీవలే శ్రీలంకలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ఇండియా జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టాడు రాహుల్ ద్రవిడ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమ్ఇండియా జట్టు, కోచ్ రవిశాస్త్రి ఇంగ్లాండ్ వెళ్లిన నేపథ్యంలో ద్రవిడ్ ఈ బాధ్యతలు స్వీకరించాడు.
ఇతరులు కూడా..
రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ కూడా తమ పదవి నుంచి తప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా ఉన్న నిక్ వెబ్.. టీ20 ప్రపంచకప్ అనంతరం ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు పేర్కొన్నాడు.
మరోవైపు టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా సిద్ధమవుతోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు యూఏఈ వేదికగా ఈ లీగ్ జరగనుంది. టీమ్ఇండియా అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తలపడనుంది.
ఇదీ చదవండి: