ETV Bharat / sports

న్యూజిలాండ్​ పర్యటనలో టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్​!

న్యూజిలాండ్​ పర్యటనలో టీమ్ఇండియా ప్రధానకోచ్​గా రాహుల్​ ద్రవిడ్​ను బీసీసీఐ ఎంపిక చేయనుందని సమాచారం. టీ20 ప్రపంచకప్​ తర్వాత ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి ఆ పదవి నుంచి తప్పుకోవడం వల్ల అందుకోసం ద్రవిడ్​ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Rahul Dravid likely to be interim coach for New Zealand series
న్యూజిలాండ్​ పర్యటనలో టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్​!
author img

By

Published : Oct 14, 2021, 7:25 PM IST

ఈఏడాది న్యూజిలాండ్​ పర్యటన కోసం టీమ్ఇండియా తాత్కాలిక కోచ్​గా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్​ను ఎంపికచేసే అవకాశం ఉన్నట్లు బీసీబీఐ వర్గాలు చెబుతున్నాయి. టీ20 ప్రపంచకప్​ తర్వాత ప్రస్తుత కోచ్​ రవిశాస్త్రి తప్పుకోనున్న నేపథ్యంలో అతని స్థానంలో కొత్త కోచ్​ను నియమించేందుకు బీసీసీఐ యోచిస్తోంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు అనిల్​ కుంబ్లే, రాహుల్​ ద్రవిడ్​ పేర్లను పరిశీలించగా.. రాబోయే న్యూజిలాండ్​ పర్యటనకు రాహుల్​ ద్రవిడ్​ను కోచ్​గా నియమించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇటీవలే శ్రీలంక పర్యటనలో కోచ్​గా వ్యవహరించిన అనుభవం ద్రవిడ్​కు ఉంది. దీంతో కివీస్​ పర్యటనకు ద్రవిడ్​ను ఎంచుకోనున్నారని సమాచారం. అయితే టీమ్ఇండియా కోచ్​ పదవి కోసం కొందరు ఆస్ట్రేలియా మాజీలు ప్రయత్నిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి.. IPL 2021 Final: అసలైనపోరులో ట్రోఫీ నెగ్గేదెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.