Rahmanullah Gurbaz World Cup : ఆఫ్గనిస్థాన్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్‌ను ఇటీవలే ఐసీసీ మందలించింది. మ్యాచ్ సమయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఉల్లఘించనందువల్ల అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఐసీసీ ప్రవర్తనా నియామవళిలోని లెవల్ 1ను గుర్భాజ్ ఉల్లఘించినట్లు తెలిసింది. దీంతో అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ను చేర్చి గుర్భాజ్‌ను మందలించింది. అయితే ఒక ప్లేయర్ ఖాతాలో 24 నెలల్లో నాలుగు డీమెరిట్ పాయింట్లు చేరితే.. ఆ ప్లేయర్‌పై సస్పెన్షన్ వేటును విధిస్తారు.
అసలేం జరిగిందంటే : ఇటీవలే ఇంగ్లాండ్ ఆఫ్గనిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సెంచరీకి చేరువైన.. గుర్భాజ్ 19వ ఓవర్‌లో రనౌటయ్యాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్ నుంచి పరుగెత్తి గుర్భాజ్ డైవ్ చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇలా ప్రపంచకప్‌లో సెంచరీ చేసే అవకాశం చేజారడం వల్ల తీవ్ర నిరాశకు గురైన గుర్భాజ్.. ఆగ్రహంతో ఊగిపోయాడు. గ్రౌండ్‌పై బ్యాట్‌తో కోపంగా కొట్టాడు. మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తున్న క్రమంలో బౌండరీ లైన్, పక్కన ఉన్న కుర్చీని బ్యాట్‌తో బలంగా బాదాడు. ఈ క్రమంలోనే గుర్భాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
ENG VS AFG World Cup 2023 : ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గా..న్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్.. అఫ్గాన్ స్పిన్నర్ల ధాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో అఫ్గాన్ 69 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మహ్మద్ నబీ (2/16), ముజీబుర్ రెహ్మన్ (3/51), రషీద్‌ఖాన్ (37/3) ప్రత్యర్థి జట్టును గట్టి దెబ్బకొట్టారు.
మరోవైపు అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్భాజ్ (80) మెరుపులు మెరిపించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇక్రమ్ (58) అర్ధ శతకం బాదాడు. చివర్లో ముజిబుర్ రెహ్మన్ (28) దూకుడుగా ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 3, మార్క్ వుడ్ 2, లివింగ్ స్టోన్, జోరూట్, టాప్లీ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో అఫ్గన్ జట్టు విజయాన్ని అందుకుంది.
ODI WorldCup 2023 AFG VS ENG : జగజ్జేత ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆప్గానిస్థాన్.. ప్రపంచకప్‌లో సంచలనం
World Cup Sensation Winners : మెగాటోర్నీలో సంచలన విజయాలు.. మేటిజట్లకు షాకిచ్చిన పసికూనలు!