Player Of The Tournament World Cup : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సినల్ (ఐసీసీ) 1975లో వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభించింది. అయితే తొలి నాలుగు ఎడిషన్లకు భిన్నంగా 1992 ప్రపంచకప్ స్టార్ట్ అయ్యింది. ఈ ఎడిషన్ నుంచే టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌ను ఐసీసీ.. 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డుతో సత్కరిస్తుంది. అప్పటినుంచి వరుసగా 8 ఎడిషన్లలో ఈ అవార్డును ఆయా ఆటగాళ్లకు ప్రధానం చేశారు. అయితే ఎనిమిదిలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల ప్లేయర్లు రెండేసి సార్లు ఈ అవార్డు పొందగా.. శ్రీలంక, సౌతాఫ్రికా ఆటగాళ్లు ఒక్కోసారి దక్కించుకున్నారు. మరి వారెవరో తెలుసుకుందాం.
- మార్టిన్ క్రొవ్ - 1992 : న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రొవ్.. ప్రపంచకప్ హిస్టరీలో తొలి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు. అతడు ఆ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 456 పరుగులు చేశాడు. కానీ, ఈ ఎడిషన్‌లో కివీస్ సెమీస్‌లోనే నిష్క్రమించింది.
- సనత్ జయసూర్య - 1996 : శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య.. 1992లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడు ఈ ఎడిషన్‌లో 221 పరుగులతో సహా 7 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది.
- లాన్స్ క్లూస్నర్ - 1999 : సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ లాన్స్ క్లూస్నర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాట్‌తో 281 పరుగులు చేసిన క్లూస్నర్.. బంతితో 17 వికెట్లు నేలకూల్చి ఈ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
- సచిన్ తెందూల్కర్ - 2003 : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్.. వరల్డ్‌కప్‌లో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న తొలి టీమ్ఇండియా ప్లేయర్‌గా నిలిచాడు. సచిన్ 2003లో ఏకంగా 673 పరుగులు బాది రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును దాదాపు 20 ఏళ్ల తర్వాత.. ప్రస్తుత టోర్నీలో విరాట్ కోహ్లీ బద్దలుకొట్టాడు.
- గ్లెన్ మెక్‌గ్రాత్ - 2007 : ఆస్ట్రేలియా బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్.. 2007 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అతడు టోర్నీలో 26 వికెట్లు పడగొట్టి.. ఈ అవార్డు అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. అప్పటివరకు ఈ అవార్డును బ్యాటర్ లేదా ఆల్‌రౌండర్లు దక్కించుకున్నారు.
- యువరాజ్ సింగ్ - 2011 : భారత్ రెండోసారి వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న వేళ.. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. 2011లో భారత్ విశ్వ విజేతగా నిలవడంలో యువరాజ్ పాత్ర కీలకం. ఈ టోర్నీలో అతడు.. 362 పరుగులు, 15 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు.
- మిచెల్ స్టార్క్ - 2015 : ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఈ ఎడిషన్‌లో 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. అయితే వరల్డ్‌కప్ హిస్టరీలో ఈ అవార్డు అందుకున్న రెండో బౌలర్ స్టార్క్. అయితే రెండుసార్లు కూడా ఈ అవార్డు ఆసీస్ బౌలర్లకే దక్కింది.
- కేన్ విలియమ్సన్ - 2019 : గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు వరించింది. అతడు ఈ టోర్నీలో 578 పరుగులు చేశాడు.
2023లో ఎవరిని వరించేనో.. ఈ టోర్నీలో టీమ్ఇండియా బ్యాటర్ విరాట్ ఇప్పటికే 711 పరుగులు బాది టాప్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో వరల్డ్‌కప్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (550 పరుగులు) నిలకడగా జట్టుకు అదిరే ఆరంభాలు అందిస్తున్నాడు. మరోవైపు పేస్ బౌలర్ షమీ ఇప్పటికే 23 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో ఆసీస్ స్పిన్నర్ 22 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కూడా నిలకడగా రాణిస్తు 18 వికెట్లు పడగొట్టాు. చూడాలి మరి ఈసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరిని వరిస్తుందో.
-
So Jeichalum thothalum Player of the Series Virat Kohli than. pic.twitter.com/1g1XTpKGyu
— Kettavan Memes (@Kettavan__Memes) November 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">So Jeichalum thothalum Player of the Series Virat Kohli than. pic.twitter.com/1g1XTpKGyu
— Kettavan Memes (@Kettavan__Memes) November 17, 2023So Jeichalum thothalum Player of the Series Virat Kohli than. pic.twitter.com/1g1XTpKGyu
— Kettavan Memes (@Kettavan__Memes) November 17, 2023
విరాట్, డికాక్, రోహిత్ - పరుగుల వరద పారించిన టాప్ 10 బ్యాటర్లు
2023 World Cup Records : మెగాటోర్నీ మొనగాళ్లు వీరే.. రోహిత్, డికాక్, విరాట్ ఇంకా ఎవరంటే?