టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ వెన్నునొప్పితో బాధ పడుతున్నాడా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డే సందర్భంగా తాను ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వెన్నునొప్పితో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. స్ట్రెచర్‌పై పడుకున్న పంత్ ఫోటోలు లీకై సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పంత్ గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ పంపించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో డిసెంబర్ 4 నుంచి మొదలుకానున్న బంగ్లాదేశ్ టూర్‌కు పంత్ వెళ్లేది అనుమానంగా మారింది. మరి అతని స్థానంలో ఎవరినైనా ఎంపిక చేస్తారా లేక పంత్‌ను ఆడిస్తారా అనేది చూడాలి.
ఇక పంత్ బ్యాటింగ్ వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని అవకాశాలిచ్చినా పంత్ తన బ్యాటింగ్ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. పేలవ షాట్లతో వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఇక తన చివరి ఐదు వన్డేల్లో పంత్ చేసిన స్కోర్లు.. 10, 15, 125,0, 56, 18.. ఇక 2022 ఏడాదిలో 12 వన్డేలు ఆడిన పంత్ 223 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేలతో పోలిస్తే టీ20ల్లో అతని బ్యాటింగ్ కాస్త బెటర్‌గా కనిపిస్తుంది.
శాంసన్‌కు ఛాన్స్.. పంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా పంత్ కంటే శాంసన్ స్రైక్‌రేట్ చాలా బాగుంది. రానున్న వన్డే వరల్డ్‌కప్ 2023ని దృష్టిలో పెట్టుకొని చూస్తే శాంసన్‌కు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో టీమ్ఇండియా మూడు వన్డేలు ఆడనుంది. వరల్డ్‌కప్‌కు ముందు టీమ్ఇండియాకు 21 మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో శాంసన్‌కు కాస్త ఎక్కువ అవకాశాలు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.
ఇదీ చూడండి: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. దూసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్, గిల్