ETV Bharat / sports

మ్యాచ్​ మధ్యలో ఫ్యాన్స్​తో గొడవపడిన పాక్ క్రికెటర్​.. కొట్టేందుకు యత్నం - ఫ్యాన్స్​తో పాక్ క్రికెటర్​ ఫైట్​

ఓ పాక్ క్రికెటర్​ అభిమానులతో గొడవకు దిగాడు. వారిని కొట్టేందుకు యత్నించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?

Pakisthan fast bowler Hasan ali fight with fans in local match
మ్యాచ్​ మధ్యలో ఫ్యాన్స్​తో గొడవపడిన పాక్ క్రికెటర్​.. కొట్టేందుకు యత్నం
author img

By

Published : Dec 6, 2022, 11:04 AM IST

ఫామ్‌ కోల్పోయి జట్టుకు దూరమైన పాకిస్థాన్​ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీ సహనం కోల్పోయాడు. తనను కామెంట్​ చేసిన కొంతమంది ఫ్యాన్స్​తో గ్రౌండ్​లోనే గొడవకు దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే అతడు ఒక లోకల్‌ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. పంజాబ్‌ ఫ్రావిన్స్‌లోని పక్‌పత్తన్‌ జిల్లాలో ఈ మ్యాచ్‌ జరిగింది.

అయితే ఈ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో హసన్‌ అలీ బౌండరీ లైన్‌ వద్ద నిల్చున్నాడు. ఈ సమయంలో కొంతమంది ఆకతాయిలు హసన్‌ అలీపై కామెంట్స్​ చేశారు. జట్టులో చోటు కోల్పోయి గల్లీ క్రికెట్‌ ఆడడానికి వచ్చాడు అంటూ ఆటపట్టించారు.కొంతమందైతే గడ్డి, పేపర్లను కూడా విసిరారు. అయినా అప్పటికీ చాలాసేపు ఓపికతో భరించిన హసన్‌ అలీ.. సహనం కోల్పో​యి వారితో వివాదానికి దిగాడు. వారిని కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే పక్కన ఉన్నవారు పరిస్థితిని అదుపు చేసి హసన్‌ అలీని అడ్డుకున్నారు.

ఒక లోకల్‌ మ్యాచ్‌లో ఆడేందుకు ఒప్పుకున్న అంతర్జాతీయ క్రికెటర్‌ను ఇలా అవమానిస్తారా అంటూ మ్యాచ్‌ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్‌ అలీతో గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా 2021 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక సెమీఫైనల్లో హసన్‌ అలీ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. అప్పటినుంచి హసన్‌ అలీని ట్రోల్స్​కు గురౌతున్నాడు. ఆ తర్వాత ఫామ్‌ కోల్పోయిన అతను జట్టుకే దూరమయ్యాడు.

  • You gotta feel for Hasan Ali. He is out of the team but never gave any toxic statement always kept supporting the team. Once a No 1 ODI bowler and now he is facing such things in a random club game. pic.twitter.com/L2OLjVPRQd

    — zayn (@ZaynMahmood5) December 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: వామ్మో.. ఫిఫా వరల్డ్‌కప్‌ నిర్వహణ ఖర్చు అన్ని లక్షల కోట్లా.. ఏమైనా లాభముందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.