పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) టీ20 ప్రపంచకప్(T20 World Cup) కోసం జట్టును(Pak team for t20 world cup) ప్రకటించింది. అయితే ఈ జట్టుపై కెప్టెన్ బాబర్ అజామ్ (Babar Azam) సంతోషంగా లేనట్లు తెలుస్తోంది. ఫఖర్ జమాన్, సర్ఫరాజ్ అహ్మద్ వంటి అనుభవజ్ఞులను టీమ్‌లోకి తీసుకోలేదు. దీంతో జట్టు ఎంపికపై బాబర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.
ఓపెనర్లు షర్జీల్ ఖాన్, ఫఖర్ జమాన్, ఆల్ రౌండర్ ఫహీం అష్రాఫ్, లెగ్ స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్‌లను టీ20 ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవాలని బాబర్.. పీసీబీకి సూచించినట్లు సమాచారం. కానీ సెలక్షన్ కమిటీ వీరిని పక్కనబెట్టింది. అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా బాబర్ పేర్కొన్న వారిని కాదని అసిఫ్ అలీ, కుష్దిల్ షా, అజమ్ ఖాన్, సోయబ్ మక్సూద్లకు సెలక్షన్ కమిటీ ప్రాధాన్యమిచ్చింది.
టీ20 ప్రపంచకప్‌కు పాక్ జట్టు
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, అజామ్ ఖాన్, హరిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వాసీం, కుష్దిల్ షా, మహమ్మద్ హఫీద్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వాసీం, షహీన్ షా అఫ్రిదీ, షోయబ్ మక్సూద్.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నేతృత్వంలో.. టీ20 ప్రపంచకప్ అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికలుగా జరగనుంది. అంతకుముందు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు న్యూజిలాండ్‌తో వరుసగా మూడు వన్డే మ్యాచ్‌లతో పాటు ఐదు టీ20లు ఆడనుంది పాక్. తర్వాత స్వదేశంలో అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్‌తో రెండు టీ20ల్లో పోటీపడనుంది.
ఇదీ చూడండి: 'ఇంగ్లాండ్ లోపాల్ని కోహ్లీసేన ఎత్తి చూపింది'