Pakistan Semi Final Scenario : 2023 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. సెమీస్‌కు ముందు మరో 3 మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉన్నాయి. అయితే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నాయి. మిగిలిన చివరి బెర్త్‌ను న్యూజిలాండ్.. దాదాపు దక్కించుకున్నట్లే. కానీ కివీస్ సెమీస్ చేరాలంటే.. పాకిస్థాన్ చివరి మ్యాచ్ ఫలితం వరకు ఆగాల్సిందే.
అయితే పాక్.. సెమీస్ చేరాలంటే తమ చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించాలి. పాయింట్ల పట్టికలో కివీస్ (+0.743) రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. పాక్ (+0.036) రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. ఈ లెక్కన పాక్, కివీస్ రన్‌రేట్‌ను అధిగమించాలంటే.. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ తేడాతో నెగ్గాలి. ఒకవేళ ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగితే.. ఆ జట్టుని 150 పరుగుల లోపు కట్టడి చేసి ఆ లక్ష్యాన్ని 3.4 ఓవర్లలో ఛేదించాలి.
ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. శుక్రవారం ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో తమ జట్టు సెమీస్ అర్హత సాధిస్తుందని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు. "మేము ఇంగ్లాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్‌ను అధిగమించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మా బ్యాటర్ ఫకర్ జమాన్ 20 - 30 ఓవర్ల దాకా క్రీజులో ఉంటే.. మేం భారీ స్కోర్ సాధిస్తాం" అని బాబర్ అన్నాడు.
-
Captain Babar Azam 🗣️: "Our innings will be planned, ye nhi hai k ja k andha dhund Fire khol dein, I would want fakhar to stay at crease for 20-30 overs, then we can achieve it" #PAKvsENGpic.twitter.com/XFlA4YwVcW
— SAAD 🇵🇰 (@SaadIrfan258) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Captain Babar Azam 🗣️: "Our innings will be planned, ye nhi hai k ja k andha dhund Fire khol dein, I would want fakhar to stay at crease for 20-30 overs, then we can achieve it" #PAKvsENGpic.twitter.com/XFlA4YwVcW
— SAAD 🇵🇰 (@SaadIrfan258) November 10, 2023Captain Babar Azam 🗣️: "Our innings will be planned, ye nhi hai k ja k andha dhund Fire khol dein, I would want fakhar to stay at crease for 20-30 overs, then we can achieve it" #PAKvsENGpic.twitter.com/XFlA4YwVcW
— SAAD 🇵🇰 (@SaadIrfan258) November 10, 2023
-
Babar Azam said, "if Fakhar Zaman stays till 20-30 overs, we can achieve big scores tomorrow". pic.twitter.com/ZFmJrRIiTx
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Babar Azam said, "if Fakhar Zaman stays till 20-30 overs, we can achieve big scores tomorrow". pic.twitter.com/ZFmJrRIiTx
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023Babar Azam said, "if Fakhar Zaman stays till 20-30 overs, we can achieve big scores tomorrow". pic.twitter.com/ZFmJrRIiTx
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2023
బాబర్ ధీమాకు ఆ ఇన్నింగ్సే కారణం! పాక్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌లో పాక్.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 21 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. 402 పరుగుల భారీ లక్ష్యాన్ని పాక్ ముందుంచింది. దీంతో పాక్ ఓటమి ఖాయమని అనుకున్నారంతా. కానీ, పాక్ బ్యాటర్ ఫకర్ జమాన్.. ప్రారంభం నుంచే తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. అతడు 81 బంతుల్లోనే 126 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా జమాన్ ఇదే విధంగా.. విధ్వంసం సృష్టిస్తాడన్న నమ్మకంతోనే బాబర్ అలా అన్నాడని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.
-
THIS FAKHAR ZAMAN SAJDA MAN I HAVE SEEN EVERYTHINGG pic.twitter.com/RS8KrO8OPc
— c (@gayomarlic) November 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">THIS FAKHAR ZAMAN SAJDA MAN I HAVE SEEN EVERYTHINGG pic.twitter.com/RS8KrO8OPc
— c (@gayomarlic) November 4, 2023THIS FAKHAR ZAMAN SAJDA MAN I HAVE SEEN EVERYTHINGG pic.twitter.com/RS8KrO8OPc
— c (@gayomarlic) November 4, 2023
బైబై పాకిస్థాన్.. అయితే ఈ సమీకరణాల ప్రకారం పాక్.. సెమీస్‌కు చేరడం అసాధ్యమైన పని. దీంతో టీమ్ఇండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్.. సోషల్ మీడియా వేదికగా పాక్‌ను వ్యంగ్యంగా ట్రోల్ చేశాడు. " పాకిస్థాన్ పరిగెత్తండి. మీ జర్నీ ఇక్కడి వరకే. మా ఆతిథ్యం, బిర్యానీ మీరు ఆస్వాదించారని అనుకుంటున్నాను. క్షేమంగా ఇంటికి వెళ్లండి. బైబై పాకిస్థాన్" అని ఇన్‌స్టాగ్రామ్‌లో సెహ్వాగ్ పోస్ట్ చేశాడు.
సెమీస్‌లో నాలుగో బెర్త్ కివీస్‌దే! - పాకిస్థాన్ రెస్లో ఉండాలంటే?
నాకౌట్ మ్యాచ్‌ల టికెట్ల సేల్ అప్పుడే - గెట్ రెడీ క్రికెట్ ఫ్యాన్స్