ETV Bharat / sports

'నన్నో నేరస్థుడిలా చూశారు'.. పీసీబీ కొత్త ఛైర్మన్​​పై మాజీ చీఫ్​​ తీవ్ర ఆరోపణలు

కొత్తగా ఎన్నికైన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు ఛైర్మన్​ నజామ్ సేథీపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ చీఫ్​ రమీజ్ రజా. తనను అకారణంగా పదవి నుంచి తొలగించడంపై మండిపడ్డారు. ఒక వ్యక్తికి పదవి కట్టబెట్టడం కోసం పీసీబీ రాజ్యాంగాన్నే మార్చేశారని ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే..

PCB Issue Raja Sethi
Rameez Raja Nazaam Sethi
author img

By

Published : Dec 27, 2022, 9:08 PM IST

Updated : Dec 27, 2022, 10:02 PM IST

పీసీబీ చీఫ్​గా తనను తొలగించడంపై మాజీ ఛైర్మన్​ రమీజ్​ రజా తీవ్ర విమర్శలు చేశారు. తనపై వేటు వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అలాగే పాకిస్థాన్ జర్నలిస్ట్, వ్యాపారవేత్త అయిన నజామ్​ సేథీను పీసీబీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేయడంపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్​ ఛానల్​లో స్పందించారు.

నన్నో నేరస్థుడిలా చూశారు..
'నాపై బోర్డు యాజమాన్యం వ్యవహరించిన తీరు చాలా అమానుషం. ఉదయం 9 గంటల సమయంలో దాదాపు 17 మంది పీసీబీ కార్యాలయంపై దాడి చేశారు. కనీసం నా వస్తువులను తీసుకెళ్లేందుకు కూడా అనుమతించలేదు. ఈ దాడి పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. ఓ క్రికెట్​ కార్యాలయంపై దాడి చేసినట్లుగా ఉంది ' అని రజా తన ఛానల్​లో చెప్పుకొచ్చారు.

ఆయనకు క్రికెట్​పై ఇంట్రెస్ట్​ లేదు..
రజా తన యూట్యూబ్ ఛానెల్‌లో అభిమానుల ప్రశ్నలకు స్పందిస్తూ.. సేథ్​ లాంటి వ్యక్తులు క్రికెట్ పట్ల తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారని.. అలాంటి వారినే క్రికెట్ బోర్డు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందని చెప్పారు. వారికి కావలసిందల్లా తమ పరపతిని పెంచుకుని, మిగతావాళ్లు వారు చెప్పినట్లు వినేలా చేయడమేనని ఆరోపించారు.

ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్థాన్ వైట్​ వాష్ అయింది. దీనికి రజాను బాధ్యున్ని చేస్తూ.. ఆయన్ను పదవిలోంచి​ తొలగించారు. అయితే తన పదవి కాలం పూర్తి కాకముందే ఆయన్నుతీసివేయడంపై అసహనం వ్యక్తం చేశారు. 'కేవలం ఒక వ్యక్తికి పదవి కట్టబెట్టడానికి మీరు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రాజ్యాంగాన్నే మార్చేశారు. నజామ్ సేథీకి పదవి అప్పజెప్పటానికి మీరు రాజ్యాంగం మార్చిన తీరు ఇప్పటివరకు నేనెక్కడా చూడలేదు' అని రజా ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీసీఐపై రజా అక్కసు..
2021 సెప్టెంబరులో మాజీ ప్రధాని, పాకిస్థాన్ ప్రపంచ కప్ విన్నింగ్​ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ హయాంలో పీసీబీ చీఫ్‌గా రజా పగ్గాలు చేపట్టారు. దాదాపు 15 నెలల పాటు పదవిలో కొనసాగారు. పదవీకాలంలో పలు వివాదాలతో కూడా రజా వార్తల్లో నిలిచారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఎదుగుదలను బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని ఆయన విమర్శలు చేశారు. 2023లో పాకిస్థాన్‌లో జరగనున్న ఆసియా కప్ కోసం భారత్​ తమ దేశానికి రాకుంటే.. 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్​న​కు పాకిస్థాన్ జట్టు కూడా దూరంగా ఉంటుందని రజా హెచ్చరించారు.

Last Updated : Dec 27, 2022, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.