ETV Bharat / sports

డ్రాగా ముగిసిన ఆసీస్​-పాక్​ రెండో టెస్టు.. ఆజామ్​ కొత్త రికార్డు! - ఆస్ట్రేలియా

Aus-Pak Second Test: కరాచీ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్​ల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. 506 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన పాక్​ జట్టు.. భారీ పరుగులు (443/7) చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించుకుంది.

second test drawn
pak aus teams
author img

By

Published : Mar 16, 2022, 8:10 PM IST

Updated : Mar 16, 2022, 8:19 PM IST

Aus-Pak Second Test: ఆస్ట్రేలియా-పాకిస్థాన్​ల మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్​లో 505 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్​ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులు చేసింది. ఫలితంగా మ్యాచ్​ డ్రాగా ముగిసింది.

రెండో టెస్టు మొదటి రోజు టాస్​ నెగ్గి ఆసీస్​ జట్టు బ్యాటింగ్​కు​ దిగింది. మొదటి ఇన్నింగ్స్​లో 189 ఓవర్లు ఆడిన ఆస్టేలియా జట్టు 9 వికెట్లు కోల్పోయి 556 పరుగుల వద్ద డిక్లేర్​ చేసింది. ఆసీస్​ బ్యాటర్లలో Khawaja(160), స్టీవెన్​ స్మిత్​(72), అలెక్స్​ కారే(93) రాణించారు. కాగా, తొలి ఇన్నింగ్స్​లో ఆసీస్​ బౌలర్ల ధాటికి పాక్​ జట్టు తడబడింది. 53 ఓవర్లు ఆడి 148 పరుగులకే ఆలౌటైంది​. ఆసీస్​ బౌలర్లలో స్టార్క్​ మూడు వికెట్లు తీయగా, స్వెప్​సన్​ రెండు వికెట్లు పడగొట్టారు. గ్రీన్​, కమిన్స్​, లయన్ చెరో వికెట్​ దక్కించుకున్నారు.

408 పరుగుల ఆధిక్యంతో ఆసీస్​ జట్టు తన రెండో ఇన్నింగ్స్​ను మొదలుపెట్టింది. 22.3 ఓవర్లు ఆడి రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగుల వద్ద డిక్లేర్​ చేసింది. ఫలితంగా 505 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్​ జట్టు అద్భుతంగా ఆడింది. 171.4 ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 443 పరుగులు చేసి మ్యాచ్​ డ్రాగా ముగించుకుంది. కెప్టెన్​ బాబర్​ ఆజామ్​(196), మహమ్మద్​ రిజ్వాన్​(104),అబ్దుల్లా షఫీక్​(96)లు వీరోచితంగా పోరాడి ప్రత్యర్థి చేతులకు విజయం దక్కకుండా చేశారు.

పాక్ కెప్టెన్​ రికార్డు..

పాక్‌ కెప్టెన్‌ ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా బాబర్​ ఆజామ్​ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీ కెప్టెన్లు డాన్‌ బ్రాడ్‌మన్‌ (173*), రికీ పాంటింగ్‌ (156), టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (141)లను అధిగమించాడు.

కాగా, ఆసీస్‌, పాక్‌ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. తాజాగా కరాచీలో జరిగిన రెండో టెస్టులోనూ అదే ఫలితం రిపీటైంది. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు లాహోర్ వేదికగా జరిగే మూడో టెస్టు ఇరు జట్లకు కీలకం కానుంది.

ఇదీ చదవండి: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్‌గా చాహల్..! ట్విస్ట్​ ఏంటంటే?

Last Updated : Mar 16, 2022, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.