ETV Bharat / sports

ఐపీఎల్​ అన్ని సీజన్స్​ కలిపి ధోనీ సంపాదన ఎంతో తెలుసా? - ధోనీ ఐపీఎల్ రెమ్యునిరేషన్

మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ఈ మెగాలీగ్​లో ఎంతో మంది క్రికెటర్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రిచెస్ట్​ క్రికెటర్స్​గా నిలిచారు. మరి ఈ టోర్నీ ద్వారా.. సూపర్ క్రేజ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంత ఆర్జించాడో తెలుసా? ఆ వివరాలే ఈ కథనం..

dhoni last match in ipl latest news and dhoni net worth
ఐపీఎల్ మ్యాచుల్లో ధోనీ సంపాదన ఐపీఎల్​ నుంచి ధోనీ రిటైర్​మెంట్​
author img

By

Published : Mar 21, 2023, 9:36 PM IST

Updated : Mar 21, 2023, 9:52 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత క్రేజ్​ ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఐతే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్​ సీజన్​లో మహేంద్ర సింగ్​ ధోనీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జరిగే 16వ ఐపీఎల్ సీజన్​తోనే ధోనీ తన క్రికెట్​ కెరీర్​కు కచ్చితంగా ముగింపు పలికే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు చెన్నై సూపర్​ కింగ్స్​ టీమ్​కు సారథ్యం వహిస్తూ వస్తున్న మహీ.. ఆ జట్టుకు 4 టైటిళ్లను అందించాడు. ఇప్పటివరకు జరిగిన 15 ఐపీఎల్ సీజన్లలో 13 సార్లు ఆడిన సీఎస్​కే 11 సార్లు ప్లే ఆఫ్స్​కు చేరింది. ఇది పక్కన పెడితే ఐపీఎల్​ మ్యాచ్​ల ద్వారానే కాకుండా మిగతా మార్గాల ద్వారా ఇప్పటివరకు ధోనీ సంపాదించిన మొత్తం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్​లో ధోనీ రికార్డుల మోత..
ఝార్ఖండ్​లోని రాంచీలో పుట్టిన మహేంద్ర సింగ్​ ధోనీ.. బ్యాటర్​గా అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఇండియన్ ప్రీమియర్​ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకడు. ఇప్పటివరకు ఆడిన ఐపీఎల్​ మ్యాచుల్లో మొత్తంగా 4978 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేగాక 39.2 సగటుతో, 135 స్ట్రైక్​ రేట్​తో ఉత్తమ ఆటగాడిగా ఉన్నాడు. ఇక ఐపీఎల్​ సీజన్లు మొత్తం కలిపి 24 హాఫ్​ సెంచరీలను తన పేరిట నమోదు చేసుకున్నాడు.

ఐపీఎల్​ ధోనీ సంపాదన..
ఈ ఏడాది ఐపీఎల్​ సీజన్​కు జరిగిన వేలంలో ఎంఎస్​ ధోనీను సీఎస్​కే ఫ్రైంచైజీ అక్షరాల రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ లీగ్​ ప్రారంభ సీజన్​ 2008 వేలంలో ధోనీని రూ.6 కోట్లకు కొనింది సీఎస్​కే ఫ్రాంఛైజీ. ఆ సీజన్​లో రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన ఫైనల్​ మ్యాచ్​లో సీఎస్​కే రన్నరప్​గా నిలిచింది. అనంతరం మహీ కెప్టెన్సీలోనే 2010లో టైటిల్​ను కైవసం చేసుకుంది. అనంతరం మహీ.. ఆ జట్టు తరఫున 2011లో 8.2కోట్లు అందుకున్నాడు. ఆ తర్వాత 2014లో సీఎస్కే.. 12.5కోట్లకు అతడిని రిటైన్ చేసుకుంది. అయితే 2016,2017లో సీఎస్కే బ్యాన్​ అయిన సమయంలో మహీ.. రైజింగ్​ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. అప్పుడు అతడిని ఆ ఫ్రాంచైజీ రూ.12.5కోట్లకు దక్కించుకుంది. మళ్లీ 2018లో సీఎస్కే రీఎంట్రీ ఇచ్చాక మహీని రూ.15కోట్లకు రిటైన్​ చేసుకుంది. అయితే 2022లో మాత్రం ధోనీ సూచన మేరకు జడేజాను రూ.16కోట్లకు కొనుగోలు చేసి, తనను రూ.12కోట్లకు రిటైన్ చేసుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఐపీఎల్​లో అతడు రూ.176.8.కోట్లను ఆర్జించినట్లు తెలిసింది. అయితే ఈ మెగాలీగ్​లో రెమ్యునరేషన్​ ద్వారా ఇప్పటివరకు అత్యధికంగా ఆర్జించిన ఆటగాళ్ల జాబితాలో.. రూ.178.6 కోట్లతో రోహిత్ శర్మ మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తరఫున ఆడుతున్న స్టార్​ బ్యాటర్​ విరాట్​ కోహ్లీ రూ.173.2 కోట్ల సంపాదనతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ధోనీ@రూ.1030 కోట్లు..
అయితే ఐపీఎల్​ ద్వారానే కాకుండా బీసీసీఐ సహా ప్రముఖ బ్రాండ్​ల అడ్వర్టైజ్​మెంట్స్​ వంటి వాటి ద్వారా కూడా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటివరకు రూ.1030 కోట్ల వరకు సంపాదించి ఉండొచ్చని అంచనా. ఒక్కో బ్రాండ్​ ఎండోర్స్​మెంట్​కు రూ.3.5 నుంచి రూ.6 కోట్ల వరకు మహీ తీసుకుంటాడని సమాచారం. ఇకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​)2023 సీజన్​ డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమాతో కూడా ధోనీ భాగస్వామ్యం ఉంది.

Last Updated : Mar 21, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.