ఒక దేశం తరఫున క్రికెట్ ఆడి, మరో దేశ జాతీయ జట్టుకు ఆడాలంటే చాలా నిబంధనలు ఉంటాయి. అయితే గతంలో టీమ్ఇండియా కెప్టెన్గా, దిగ్గజ క్రికెటర్గా పేరు తెచ్చుకున్న ఇఫ్తికర్ అలీఖాన్(Iftikhar Ali Khan).. అంతకు ముందు ఇంగ్లాండ్ తరఫున కూడా పలు మ్యాచ్లు ఆడారు. ఇలా రెండు దేశాల తరఫున టెస్టులు ఆడిన ఏకైక క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పటౌడీ వంశంలో ఎనిమిదో నవాబు ఇఫ్తికర్ పటౌడీ. 1946లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టుకు(Team india) కెప్టెన్గా చేశారు. అయితే అంతకు ముందు 1932-34 మధ్య ఈయన ఇంగ్లాండ్ జట్టులోనూ ఆడారు. ఇలా రెండు జట్ల తరఫున ఆడి రికార్డు(Cricket record) సృష్టించారు.
బాలీవుడ్లో ప్రస్తుతం హీరోగా ఆకట్టుకుంటున్న సైఫ్ అలీఖాన్(Saif Ali Khan).. ఇఫ్తికర్ పటౌడీ మనవడే కావడం విశేషం. తన కుమారుడు మన్సూర్ అలీఖాన్ 11వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఇఫ్తికర్.. స్నేహితులతో గోల్ఫ్ ఆడారు. ఆ సమయంలో గుండెపోటు రావడం వల్ల ఆకస్మికంగా మృతి చెందారు.
ఇవీ చదవండి: