ETV Bharat / sports

'ఆ నినాదాలు నా శ్వాస ఆగేవరకు వినిపిస్తూనే ఉంటాయి' - sachin tendulkar icc hall of fame

భారత క్రికెట్​ అభిమానుల గుండె పగిలిన రోజు ఇది(sachin retirement day). క్రికెట్ గాడ్ అని ముద్దుగా పిలుచుకునే సచిన్.. ఆటకు వీడ్కోలు చెప్పి నేటికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు అయింది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాలు మరోసారి మీకోసం.

sachin
సచిన్​
author img

By

Published : Nov 16, 2021, 2:16 PM IST

Updated : Nov 16, 2021, 2:21 PM IST

మాస్టర్​ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్(sachin retirement day)​ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికి సోమవారానికి(నవంబరు 16) ఎనిమిదేళ్లు పూర్తయింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్​తో జరిగిన 200వ టెస్టు తర్వాత అన్ని ఫార్మాట్లకు సచిన్ రిటైర్మెంట్​ ప్రకటించాడు. ఈ మ్యాచ్​లో మాస్టర్​ 74 పరుగులు చేసి ఔటయ్యాడు.

తన చివరి అంతర్జాతీయ మ్యాచ్​లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు(sachin retirement speech). ఈ క్రమంలోనే చేసిన​ అతడి ప్రసంగం క్రికెట్​ అభిమానుల మదిలో ఎప్పటికీ అలానే నిలిచిపోతుంది.

"సమయం చాలా త్వరగా గడిచింది. కానీ, మీరు నాకు ఇచ్చిన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి. ముఖ్యంగా 'సచిన్​ సచిన్​' అని మీరు అరిచే అరుపులు నా శ్వాస ఆగేవరకు చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి" అని సచిన్​ భావోద్వేగంతో చెప్పాడు.

అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​

గతేడాది ఐసీసీ హాల్​ ఆఫ్​ ఫేమ్​లో చేరిన ఆరో భారతీయుడిగా సచిన్​ ఘనత సాధించాడు(sachin tendulkar icc hall of fame). 1989లో 16 ఏళ్లప్పుడు అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేసిన మాస్టర్​.. మొత్తంగా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా (34,357 పరుగులు) రికార్డు నమోదు చేశాడు. తర్వాతి స్థానంలో ఉన్న శ్రీలంక బ్యాట్స్​మన్​ కుమార్​ సంగక్కర్.. సచిన్ కంటే 6000 పరుగుల అంతరంతో ఉన్నాడు.

ఐపీఎల్​లో మెంటర్​గా

సచిన్(sachin international records)​.. వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 పరుగులు​ చేశాడు. 2011లో ప్రపంచకప్​ విజేతగా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలకు 2012లోనే రిటైర్మెంట్​ ప్రకటించిన సచిన్.. ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు మెంటర్​గా వ్యవహరిస్తున్నాడు.

ఇదీచూడండి: 'పంత్​కు భయమంటే తెలియదు.. అతడిలా ఆడతా'

Last Updated : Nov 16, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.