Omicron Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ జట్టులోని ఇద్దరు మహిళా క్రికెటర్లకు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవలే ఆ దేశ మహిళా క్రికెట్ జట్టు జింబాంబ్వే నుంచి తిరిగివచ్చినట్లు పేర్కొన్నారు.
"ఇద్దరు క్రికెటర్లు ఓ హోటల్లో క్వారంటైన్లో ఉన్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉంది." అని ఆరోగ్య మంత్రి జాహిద్ ఆదివారం స్పష్టం చేశారు. మరో రెండు వారాల్లో వారు కొవిడ్ నుంచి కోలుకుంటారని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. ఇద్దరు క్రికెటర్ల పేర్లను గోప్యంగా ఉంచిన ఆరోగ్య మంత్రి.. దేశంలో వెలుగుచూసిన తొలి రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఇవే అని తెలిపారు.
ఇద్దరు క్రికెటర్లతో సన్నిహితంగా ఉన్నవారికి టెస్టులు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బంగ్లా ఉమెన్ క్రికెట్ జట్టు మొత్తం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: