జాత్యాంహకార ఆరోపణలతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ అయిన ఇంగ్లాండ్ క్రికెటర్ ఒల్లీ రాబిన్సన్కు మద్దతు తెలిపాడు సీనియర్ బౌలర్ జేమ్స్ అండర్సన్. అతడి క్షమాపణలను ఇంగ్లాండ్ టీమ్ ఏకపక్షంగా ఆమోదించిందని పేర్కొన్నాడు. యుక్త వయసులో చేసిన తప్పులను ప్రస్తుతం అతడు తెలుసుకున్నాడని చెప్పాడు. ఇప్పుడు తను చాలా పరిపక్వత చెందాడని అభిప్రాయపడ్డాడు.
లార్డ్స్ వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు రాబిన్సన్. స్త్రీల పట్ల 2013లో చేసిన ట్వీట్ల నేపథ్యంలో అతన్ని క్రికెట్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. దీనిపై అతడు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
"రాబిన్సన్.. చేసిన తప్పుకు అతడు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. జట్టు మొత్తం ముందు అతడు విచారం వ్యక్తం చేశాడు. ఆ విషయం స్పష్టంగా తెలిసింది. ఆ ట్వీట్లు చేసినప్పటికీ.. ప్రస్తుతం అతనిలో చాలా మార్పు వచ్చింది. తన క్షమాపణలను జట్టు అంగీకరించిందని అనుకుంటున్నా. అతనికి ఇంగ్లాడ్ టీమ్ మద్దతు ఉంటుంది."
-జేమ్స్ అండర్సన్, ఇంగ్లాండ్ సీనియర్ బౌలర్.
ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్సన్ సస్పెండ్