ODI World cup 2023 Team India : ప్రపంచకప్ 2023లో భారత్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ప్లాయింట్ పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఓపెనర్‌గా ఉన్న రోహిత్ శర్మ చెలరేగిపోతున్నాడు. కోహ్లీ, రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సత్తా చాటారు. అప్గానిస్థాన్, పాకిస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ మంచిగా రాణించాడు. శుభ్‌మన్ గిల్ కొంత కాలంగా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఆల్ రౌండర్ హార్దిక్ బంతితో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్, జడేజా వీళ్లందరూ ఈ ఎడిషన్‌లో తమదైన ముద్ర వేశారు. మొత్తంగా జట్టులో పది స్థానాలపై ఆట తీరు విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ మిగిలిన ఆ ఒక్క ఆటగాడిపై నమ్మకం కలగటం లేదని అంటున్నారు అభిమానులు. ఆ ఆటగాడే శార్దూల్ ఠాకూర్.
Shardul Thakur Performance.. శార్దూల్ ఠాకూర్‌పై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం పెట్టుకుని మరీ తుది జట్టులో అవకాశం కల్పించింది. వన్డేల్లో అతడి ఆట ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. కొంత కాలంగా అంతంత మాత్రంగానే ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటిదాకా ఆడిన 46 వన్డేల్లో 30.54 సగటు రేటుతో 64 వికెట్లు తీశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 8 ఓవర్లల్లో 43 పరుగులిల్చి.. ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. లోయరార్డర్లో బ్యాటింగ్‌కు ఉపయోగపడతాడన్న కారణంతో శార్దూల్‌ను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రధానంగా శార్దూల్ బౌలర్.. కానీ, బౌలింగ్‌లోనూ పెద్దగా రాణిస్తున్నది లేదు. హార్దిక్‌తో ఎక్కువ ఓవర్లు వేయిస్తూ.. శార్దుల్‌కు కెప్టెన్ పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవటం కనిపిస్తోంది. ఒకవేళా అతనికి అవకాశం ఇస్తే ఎక్కువ పరుగులు ఇచ్చేస్తాడనే భయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. చెన్నైలో పిచ్ స్పిన్‌కు అనుకూలమని మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఎంచుకున్నారు. కానీ, టీమ్ మేనేజ్మెంట్ తరవాత రెండు మ్యాచ్‌లకు అతని తప్పించి శార్దూల్‌ను తీసుకుంది. ఇలా తీసుకోవటం వల్ల కలిగిన ప్రయోజనం ఏమి లేదునే విమర్శలు వస్తున్నాయి.
ఒకవేళా స్పిన్నర్ బదులు పేసరే తీసుకోవాలనుకుంటే.. ప్రత్యామ్నాయంగా షమి ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షమి మంచి వేగంతో పది ఓవర్లు బౌలింగ్ చేయగలడు. తరచుగా వికెట్లు కూడా పడగొట్టగలడు. అలాంటి బౌలర్‌ను పక్కన పెట్టి శార్దూల్‌కే ఎందుకు ఎక్కువ అవకాశాలిస్తున్నారన్నది అర్థం కాని విషయం. రాబోయే మ్యాచ్‌ల్లో అయినా జట్టు యాజమాన్యం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాదేమో చూడాలి.
-
India and New Zealand are the early pacesetters as other sides start making their moves 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Which teams will secure a critical top-four spot at #CWC23? pic.twitter.com/77oJPqcBfF
">India and New Zealand are the early pacesetters as other sides start making their moves 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 18, 2023
Which teams will secure a critical top-four spot at #CWC23? pic.twitter.com/77oJPqcBfFIndia and New Zealand are the early pacesetters as other sides start making their moves 👊
— ICC Cricket World Cup (@cricketworldcup) October 18, 2023
Which teams will secure a critical top-four spot at #CWC23? pic.twitter.com/77oJPqcBfF
ODI World Cup 2023 IND VS PAK : ఆ మజా మళ్లీ దొరకదా?.. భారత్ - పాక్ మ్యాచుల్లో కిక్ ఏది బాసూ!
ODI World Cup 2023 : 'భారత్‌ను ఓడించడం కత్తిమీద సామే.. కానీ రోహిత్ ఉంటే మాత్రం..'