ODI World Cup 2023 Rohith Sharma Century : ప్రస్తుతం ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతంగా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ చెలరేగుతున్నాడు. ఓ సెంచరీ కూడా బాదాడు. అయితే ఇప్పుడు భారత్ జట్టు.. బంగ్లాదేశ్‌తో పోటీ పడనుంది(Teamindia vs Bangladesh). అయితే హిట్ మ్యాన్‌కు ఐసీసీ ఈవెంట్లలో బంగ్లాదేశ్‌పై మంచి రికార్డు ఉంది. బంగ్లాతో తలపడిన గత మూడు సార్లు రెచ్చిపోయి ఆడాడు. మూడు శతకాలు కూడా నమోదు చేశాడు.
2015 వన్డే ప్రపంచ కప్‌లో 126 బంతుల్లో 137 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ 129 బంతుల్లో శతకం(123 నాటౌట్) బాదాడు. ఆ తర్వాత 2019లోనూ 92 బంతుల్లోనే శతకం(104) సాధించాడు. అలా ఈ మూడు సార్లు.. ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ శతకాలు బాదిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు హిట్ మ్యాన్. మరి ఇంతటి ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్న రోహిత్.. ఇప్పుడు జరగబోయే మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌పై వరుసగా నాలుగో సెంచరీ బాదుతాడని అంతా ఆశిస్తున్నారు. చూడాలి మరి హిట్ మ్యాన్ ఎలా ఆడుతాడా అనేది.
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ ఇప్పటివరకు మూడు మ్యూచులు ఆడాడు. ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ బాది ఫామ్‌లో ఉన్నాడు. 72.33 యావరేజ్ ఉంది. మొత్తంగా 217 పరుగులు చేసి... ఈ టోర్నీ లిడింగ్ రన్ స్కోర్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు రోహిత్.
-
8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD
">8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD8⃣6⃣ Runs
— BCCI (@BCCI) October 14, 2023
6⃣3⃣ Balls
6⃣ Fours
6⃣ Sixes
That was a 🔝 knock from #TeamIndia captain Rohit Sharma! 👏 👏
Follow the match ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/W3SHVn1wzD
ODI World Cup 2023 Kohli : మరో రికార్డ్‌పై కోహ్లీ కన్ను.. ఇకపోతే బంగ్లాతో జరగబోయే మ్యాచ్‌లో రికార్డుల కింగ్ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న అతడు కూడా.. ఈ వన్డే ప్రపంచకప్‌లో మరో 77 పరుగులు చేస్తే, ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 26000 పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. రీసెంట్గా అతడు అత్యంత వేగంగా 25000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Rohit Sharma Fined : 215 కి.మీ స్పీడ్.. వివాదంలో చిక్కుకున్న రోహిత్ శర్మ!
Ind vs Ban World Cup 2023 : భారత్Xబంగ్లాదేశ్ పోరు.. 'రివెంజ్'కు టీమ్ఇండియా రెడీ!