ODI World Cup 2023 Rohith Sharma : వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించి డబుల్ హ్యట్రిక్ను నమోదు చేసుకుంది. లఖ్‌నవూ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 100 పరుగుల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. టీమ్ఇండియా మొదట బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లను కొల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయినప్పటికీ బౌలింగ్‌లో ప్లేయర్లు చెలరేగడం వల్ల 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ఆఫ్ ది మ్యాన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో అన్నాడు.
"జట్టులోని ప్రతి ఆటగాడికీ కఠిన పరీక్ష పెట్టిన మ్యాచ్ ఇది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అనుభవజ్ఞులైన మన ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడి జట్టును గెలిపించటంలో ముందుంటారని విషయం ఈ మ్యాచ్‌లో మరోమారు రుజువైంది. పట్టుదలగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం ఆడిన తీరు వేరు.. ఈ మ్యాచ్‌లో చేసిన పోరాటం వేరు. ముందు ఐదు గేముల్లో లక్ష్య ఛేదనకే దిగాం. ఈసారి మాత్రం ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న ఈ వేదికపై.. ఇంగ్లాండ్ అద్భుత బౌలింగ్‌ను ఎదుర్కొని మరీ ఈ మాత్రం స్కోరు చేయగలిగాం. అయితే బ్యాటింగ్‌లో అనుకున్నంతమేర రాణించలేదనే చెప్పాలి. నాతో పాటు మరికొందరు అనవరసరంగా వికెట్లను సమర్పించారు. మా ఇన్నింగ్స్ ముగిసిన తరువాత ఓ 30 పరుగులు తక్కువ చేసినట్లు అనిపించింది." అని రోహిత్ శర్మ అన్నాడు.
"నామమాత్రపు స్కోరుకు పరిమితమైన వేళ భారత్ బౌలింగ్ విభాగం అద్భుతం చేసింది. ప్రతిసారీ ఇలాగే జరుగుతుందని చెప్పలేం. కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై ఒత్తిడిని పెంచారు. పిచ్ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. స్వింగ్‌తో పాటు పిచ్ నుంచి కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఇంగ్లాండ్‌కు బ్యాటింగ్ చాలా కష్టంగా మారిపోయింది. మా బౌలర్ల అనుభవం కూడా మాకు కలిసొచ్చింది. అయితే, ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ కీలక అంశంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. బ్యాటర్లు రాణించి స్కోరు బోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాల్సిందే. అప్పుడే బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్యం మరీ తక్కువగా ఉంటే ఆ ఒత్తిడి బౌలింగ్‌పైనా పడుతుంది." అని రోహిత్ శర్మ అన్నాడు.
-
But who will come out on top? 🤔
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
More #CWC23 stats 👉 https://t.co/8YriFV75g4 pic.twitter.com/eMwz1HjRgy
">But who will come out on top? 🤔
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023
More #CWC23 stats 👉 https://t.co/8YriFV75g4 pic.twitter.com/eMwz1HjRgyBut who will come out on top? 🤔
— ICC Cricket World Cup (@cricketworldcup) October 30, 2023
More #CWC23 stats 👉 https://t.co/8YriFV75g4 pic.twitter.com/eMwz1HjRgy
ODI World Cup 2023 : సెమీస్ రేస్.. రెండు జట్ల లెక్క తేలిపోయింది!
Ind Vs Eng World Cup 2023 : షమీ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై టీమ్ఇండియా ఘన విజయం