ODI World Cup 2023 : వరల్డ్ కప్ - 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు అదరగొట్టేశారు. ఉప్పల్ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగి శతకాల మోత మోగించారు. కుశాల్ మెండిస్ ( 77 బంతుల్లో 122; 14×4, 6×6), సమరవిక్రమ (89 బంతుల్లో 108; 11×4,2×6) ధనాధన్ ఇన్నింగ్స్ బాది జట్టుకు భారీ స్కోరును అందించారు. ఓపెనర్ నిశాంక (61 బంతుల్లో 51; 7×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. మొత్తంగా పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. దీంతో లంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. .
అయితే పటిష్ట పేస్ దళం ఉన్న పాకిస్థాన్‌పై ప్రపంచకప్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ భారీ స్కోర్‌తో టీమ్ ఇండియా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ అయిపోయింది. శ్రీలంక దీన్ని బద్దలు కొట్టేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో పాక్‌పై హైయెస్ట్ స్కోరు సాధించిన జట్టుగా అవతరించింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ 4 వికెట్లు తీయగా.. హరీస్ రాఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ దక్కించుకున్నారు
ప్రపంచకప్ మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు, స్కోరు చేసిన జట్లు ఇవే..
- 2023 - శ్రీలంక - 344/9 - హైదరాబాద్‌లో
- 2019 - టీమ్ ఇండియా - 336/5 - మాంచెస్టర్‌లో
- 2019 - ఇంగ్లాండ్ - 334/9- నాటింగ్‌హాంలో
- 2003 - ఆస్ట్రేలియా - 310/8 - జొహన్నస్‌బర్గ్‌లో..
ODI World Cup 2023 PAK VS Srilanka : శ్రీలంక- పాకిస్థాన్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మరో రికార్డ్ కూడా నమోదైంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఒకే మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలోకి కుశాల్ మెండిస్, సమరవిక్రమ చేరారు. 2019 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై ఒకే మ్యాచ్‌లో జో రూట్ 107, జోస్ బట్లర్ 103 పరుగులు సాధించారు.
-
Sri Lanka posts a challenging 344/9 after 50 overs. 🏏 Now, it's time to defend the target!#LankanLions #SLvPAK #CWC23 pic.twitter.com/pIiThCUWbn
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sri Lanka posts a challenging 344/9 after 50 overs. 🏏 Now, it's time to defend the target!#LankanLions #SLvPAK #CWC23 pic.twitter.com/pIiThCUWbn
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023Sri Lanka posts a challenging 344/9 after 50 overs. 🏏 Now, it's time to defend the target!#LankanLions #SLvPAK #CWC23 pic.twitter.com/pIiThCUWbn
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) October 10, 2023
ODI World Cup 2023 : చరిత్ర సృష్టించిన కుశాల్ మెండిస్.. పాకిస్థాన్‌పై ఫాసెస్ట్ సెంచరీ