ODI World Cup 2023 Kohli 49 Century : స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 101* (121 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టిన వేళ టీమ్ ఇండియా 327 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందుంచింది. విరాట్ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించడంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది.
కెప్టెన్ రోహిత్ శర్మ (40 పరుగులు, 24 బంతుల్లో, 6x4, 2x6) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. వేగంగా ఆడే క్రమంలో 5.5 ఓవర్ వద్ద రబాడా బౌలింగ్‌లో క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు రోహిత్. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (23 పరుగులు) కూడా త్వరగానే ఔటయ్యాడు. కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది భారత జట్టు. వన్డేల్లో టీమ్ఇండియాకు మొదటి 5 ఓవర్లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఇక స్టార్ బ్యాటర్ విరాట్(Kohli Century), శ్రేయస్ అయ్యర్(77 పరుగులు)తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వీరిద్దరు కలిసి 3 వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసిన అయ్యర్.. 36వ ఓవర్లో ఎంగ్డీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక తర్వాక వచ్చిన కేఎల్ రాహుల్.. 42.1 ఓవర్ వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. రాహుల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ( 22 పరుగులు, 14 బంతుల్లో 5x4) వేగంగా అడే ప్రయత్నంలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా (29 పరుగులు , 15 బంతుల్లో , 3x4, 1x6) అదరగొట్టాడు. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగ్డీ, రబాడా,మార్కో జాన్సన్, కేశవ్ మహరాజ్, షంసీ తలో వికెట్ దక్కించుకున్నారు.
-
Innings break!
— BCCI (@BCCI) November 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
An excellent batting display from #TeamIndia as we set a 🎯 of 3⃣2⃣7⃣
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/Fje5l3x3sj
">Innings break!
— BCCI (@BCCI) November 5, 2023
An excellent batting display from #TeamIndia as we set a 🎯 of 3⃣2⃣7⃣
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/Fje5l3x3sjInnings break!
— BCCI (@BCCI) November 5, 2023
An excellent batting display from #TeamIndia as we set a 🎯 of 3⃣2⃣7⃣
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/iastFYWeDi#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSA pic.twitter.com/Fje5l3x3sj
విరాట్ బర్త్ డే స్పెషల్ - 49వ సెంచరీ బాదేశాడోచ్ - సచిన్‌ను సమం చేసిన కింగ