ETV Bharat / sports

ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా ఆల్​రౌండ్​ షో.. పాక్​పై సూపర్​ విక్టరీ.. కెప్టెన్ రోహిత్​ దంచికొట్టేశాడు భయ్యా - పాకిస్థాన్​పై రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్

ODI World Cup 2023 Ind Vs Pak : వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా జరిగిన హై టెన్షన్​ మ్యాచ్​లో టీమ్​ ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్​ శర్మ... 63 బంతుల్లో 6 సిక్స్​లు, 6 ఫోర్ల సాయంతో 86 పరుగులు ధనాధన్​ ఇన్నింగ్స్ ఆడాడు.

ODI World Cup 2023 Ind Vs Pak : టీమ్​ఇండియా ఆల్​రౌండ్​ షో.. పాక్​పై సూపర్​ విక్టరీ.. కెప్టెన్ రోహిత్​ దంచికొట్టేశాడు భయ్యా

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 8:09 PM IST

Updated : Oct 14, 2023, 8:29 PM IST

ODI World Cup 2023 IND VS PAK : వరల్డ్ కప్​లో పాకిస్థాన్​పై టీమ్​ఇండియా మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్​తో తలపడిన ఏడుసార్లు విజయం సాధించిన భారత జట్టు.. ఎనిమిది మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డు మరింత పదిలం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్​ 2023లో భాగంగా నేడు(అక్టోబర్ 14) జరిగిన హై టెన్షన్​ మ్యాచ్​లో అదిరిపోయే ఘన విజయం సాధించింది. ఆల్​రౌండ్​ షోతో సూపర్​ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది.

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. 30.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడాడు. 63 బంతుల్లో 6 సిక్స్​లు, 6 ఫోర్ల సాయంతో 86 పరుగులు ధనాధన్​ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్(11 బంతుల్లో 16; 4 x 6), కోహ్లీ(18 బంతుల్లో 16; 3 x4) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔట్​ అయిపోయారు. కేఎల్‌ రాహుల్‌ 19 (29 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్​కు దిగిన శ్రేయస్​ అయ్యర్​(53*; 62 బంతుల్లో) హాఫ్​ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు బ్యాటింగ్​కు దిగిన పాక్​.. నిర్ణీత 50 ఓవరల్లో 191 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. కెప్టెన్ బాబర్ అజామ్‌(58 బంతుల్లో 50; 7x4) హాఫ్​ సెంచరీ బాది ఆ జట్టులో టాప్​ స్కోరర్​గా నిలిచాడు​. మహ్మద్​ రిజ్వాన్​(69 బంతుల్లో 49; 7 x4), ఇమామ్ ఉల్ హక్​(38 బంతుల్లో 36 ; 6x4), అబ్దుల్లో షాహిక్​(24 బంతుల్లో 20; 3x4) పరుగులు చేశారు. సౌద్ షకీల్​(6), ఇఫ్టీఖర్ అహ్మద్​(4), షాదబ్​ ఖాన్​(2), మహ్మద్​ నవాజ్​(4), హసన్ అలీ(12) నామమాత్రపు స్కోర్ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్​, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్​ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ODI World Cup 2023 Ind Vs Pak : ఐదుగురు తలో రెండు వికెట్లు.. పాక్​పై భారత బౌలర్ల మ్యాజిక్​ వీడియోలు చూశారా?

Last Updated : Oct 14, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.