ODI World Cup 2023 England Performance: అగ్రశ్రేణి బ్యాటర్లు.. ప్రమాదకర బౌలర్లు.. ఇలా మొత్తంగా స్టార్ క్రికెటర్లతో నిండిన జట్టు ఇంగ్లాండ్. ప్రత్యర్థి జట్లను చావుదెబ్బ కొడుతూ.. అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా.. విజయాల వేటలో సాగేది ఇంగ్లాడు టీమ్. అందుకే ఈ ప్రపంచకప్‌లోనూ టైటిల్ ఫేవరెట్‌గా ఆ జట్టును పరిగణించారు. కానీ, ఇప్పుడు చూస్తే అంతా తలకిందులైంది. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములను చవిచూసింది. సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఇంగ్లాండ్.. తన స్థాయికి తగ్గట్టు ఆడటంలో విఫలమవుతోంది.
ప్రపంచకప్ ఆరంభంలోనే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. తరువాత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పసికూన అఫ్గాన్ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు సఫారీ చేతిలో 229 పరుగుల తేడాతో ఓడి చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ సెమీస్ రేసులో ఉండాలంటే ఆడబోయే అయిదు మ్యాచ్‌లూ గెలవాల్సిందే.
2015 రిపీట్ అవుతుందా.. అయితే ఇంగ్లాండ్ 2015 ప్రపంచకప్‌లోనూ ఇలాగే పేలవ ప్రదర్శన చేసింది. అప్పుడు 6 మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించింది. దీంతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తరవాత ఆ జట్టు పూర్తిగా మారిపోయి.. దూకుడైన ఆటతీరుతో 2019 వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌నూ సొంతం చేసుకుంది. ఆ రెండు సందర్భాల్లోనూ ఉన్న కీలక ప్లేయర్లే.. ప్రస్తుత జట్టులో ఉన్నారు. కానీ, ఇప్పుడు జట్టుల ఓడిన తీరు మరితం షాక్‌కు గురిచేస్తోంది. ఎలాంటి పోరాటం లేకుండానే చేతులెత్తేస్తోంది. స్టార్ క్రికెటర్లు ఉన్నా.. ఇంగ్లాండు జట్టు గెలవలేకపోతుంది. అందుకు సమష్టిగా సత్తాచాటలేకపోవడం.. అంచనాలకు తగ్గట్లుగా స్టార్ క్రికెటర్లు రాణించలేకపోవడమే ప్రధానం కారణమని అంటున్నారు.
2019 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు గాయం నుంచి కోలుకుంటన్న ఆర్చర్ రిజర్వ్ ఆటగాడిగా జట్టుతో కొనసాగుతున్నాడు. ఇక తుంటి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్టోక్స్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో అడుగు పెట్టనా లయ అందుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఇకపోతే బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, బట్లర్ లాంటి బ్యాటర్లు.. మొయిన్ అలీ, సామ్ కరన్, లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ లాంటి ఆల్‌రౌండర్లు.. అట్కిన్సన్, రషీద్, రీస్ టాప్లీ, మార్క్‌వుడ్ లాంటి బౌలర్లు ఉన్నారు. కానీ జట్టు గెలవలేకపోతోంది.
-
Just a reminder of what happened the last time Ben Stokes played an ODI game… 💯🔥 pic.twitter.com/uuU30i7LWk
— England Cricket (@englandcricket) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Just a reminder of what happened the last time Ben Stokes played an ODI game… 💯🔥 pic.twitter.com/uuU30i7LWk
— England Cricket (@englandcricket) October 21, 2023Just a reminder of what happened the last time Ben Stokes played an ODI game… 💯🔥 pic.twitter.com/uuU30i7LWk
— England Cricket (@englandcricket) October 21, 2023
సరైన నిర్ణయాల్లో ఫెయిల్.. టెస్టుల్లోనే టీ20 ఆటతీరుతో అదరగొట్టే ఇంగ్లాండ్.. వన్డేల్లో మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోతుంది. క్రీజులో బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. బంగ్లాదేశ్ పై మలన్ 140 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో రూట్ వరుసగా 77, 82 పరుగులు చేశాడు. బెయిర్‌స్టో కూడా వరుసగా 33, 52 పరుగులు సాధించాడు. కానీ నిలకడైన ప్రదర్శన లేదు. భారీ ఇన్నింగ్స్ ఇవ్వలేకపోవటం, తుది జట్టు ఎంపిక కూడా సరిగ్గా ఉండటం లేదు. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోతోంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, సామ్ కరన్‌ను తప్పించి స్టోక్స్, విల్లీ, అట్కిన్సన్‌ను ఆడించింది. విల్లీ, అట్కిన్సన్‌కు ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్. దీంతో బట్లర్ బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గానూ విఫలమవుతున్నాడు.అవసరమైన సమయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టాప్లీ గాయంతో మధ్యలో బయటకు వెళ్లి వచ్చాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రూట్‌తో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. అతని బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. అలాగే బ్యాటింగ్‌కు చక్కగా సహకరించిన పిచ్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమూ దెబ్బతీసింది. ఇలా సరైన సయమంలో నిర్ణయాలు తీసుకోవటంలో కెప్టెన్ విఫలమవుతున్నాడు. మరోవైపు ఆటగాళ్లు వేడిని తట్టుకోలేక అలసిపోతున్నారు. ఇంగ్లాండ్ తిరిగి పుంజుకోవాలంటే తుది జట్టు ఎంపికలో కాదు దృక్పథంలో మార్పు రావాలి. ఇప్పటికీ జట్టులోని ఆటగాళ్లు సత్తాచాటితే ఇంగ్లాండ్ ప్రమాదకరంగా మారుతుంది. ఎంతటి ప్రత్యర్థినైనా చిత్తుచేసి సత్తా ఆ జట్టుకుంది. కానీ ముందుగా ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉండాలి.. తమను తాము నమ్మాలి. విజయాలు సాధిస్తామనే కసితో సాగాలి.
-
🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
">🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo🇿🇦 RAISE YOUR FLAG
— Proteas Men (@ProteasMenCSA) October 21, 2023
A statement win for the Proteas as they a notch 229 victory over England 🏏
One down on to you @Springboks🇿🇦 we are fully behind YOU 🫂 #CWC23 #BePartOfIt pic.twitter.com/P2WYANYfwo
ENG vs SA World Cup 2023 : డిఫెండింగ్ ఛాంప్ డీలా.. 229 పరుగుల భారీ తేడాతో సౌతాఫ్రికా విక్టరీ
World Cup Sensation Winners : మెగాటోర్నీలో సంచలన విజయాలు.. మేటిజట్లకు షాకిచ్చిన పసికూనలు!