ETV Bharat / sports

Nishanth Saranu Pakistan Net Bowler : పాకిస్థాన్ నెట్​ సెషన్స్​లో హైదరాబాదీ ప్లేయర్​.. ఈ 7 అడుగుల కుర్రాడు వెరీ స్పెషల్!

Nishanth Saranu Pakistan Net Bowler : రానున్న ప్రపంచకప్​ కోసం భారత్​కు వచ్చిన పాకిస్థాన్​ జట్టు.. హైదరాబాద్​ వేదికగా తొలి ప్రాక్టీస్​ మ్యాచ్​ ఆడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే కసరత్తులు ఆరంభించగా.. అందలో ఆ టీమ్​ ప్లేయర్ల కంటే ఓ నెట్​ బౌలర్​పై అందరి దృష్టి పడింది. ఇంతకీ అతనెవరు ? అతని స్టోరీ ఏంటంటే ?

Nishanth Saranu Pakistan Netbowler
Nishanth Saranu Pakistan Netbowler
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 9:09 PM IST

Nishanth Saranu Pakistan Netbowler : భారత్ ఆతిథ్యమివ్వనున్న వన్డే ప్రపంచకప్​నకు సన్నాహకాలు మొదలైపోయాయి. అక్టోబర్​ 5న అట్టహాసంగా మొదలవ్వనున్న ఈ పోరులో పాల్గొనేందుకు వివిధ దేశాల ప్లేయర్లు ఇండియాకు వస్తున్నారు. ఇప్పటికే అఫ్గానిస్థాన్ టీమ్​ రాగా.. తాజాగా పాకిస్థాన్ జట్టు కూడా హైదరాబాద్​కు చేరుకుంది. ఇక వరల్డ్​ కప్​నకు ముందు ఆడే ప్రాక్టీసులు ఆరంభమవ్వనున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 29న పాకిస్థాన్​ తన తొలి వార్మప్​ మ్యాచ్​ను న్యూజిలాండ్​తో ఆడనుంది. అయితే దీని కోసం పాక్​ సేన ఇప్పటికే కసరత్తులు ప్రారంభించగా.. వారి నెట్​ ప్రాక్టీస్​లో ఆరడుగులున్న ఓ వ్యక్తిపై అందరి దృష్టి పడింది. ఆ వ్యక్తి మైదానంలో బంతులను సంధిస్తుంటే అందరూ అలా చూస్తూ ఉండిపోయారు. అతనెవరా అంటూ నెట్టింట తెగ వెతికేశారు. అయితే అతనెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన అండర్-19 పేసర్ నిశాంత్ సరను.

అండర్​ 19 క్రికెట్​ జట్టులో ఉన్న నిశాంత్... ప్రస్తుతం పాకిస్థాన్ జట్టుకు అందుబాటులో ఉన్న అనేక మంది నెట్ బౌలర్లలో ఒకడు. హారిస్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది లాంటి మేటి స్పిన్నర్లు ఉన్న పాక్​ జట్టుకు.. ప్రాక్టీస్​ సమయంలో అందుబాటులో ఉండేందుకు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌.. నిశాంత్​ను ఎంపిక చేశారు. గురువారం జరిగిన నెట్​ సెషన్​లో బౌలింగ్ చేసిన నిశాంత్ తన స్టైల్​తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలో రౌఫ్, "నేను ప్రస్తుతం గంటకు 125-130 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగలను. మోర్నే (మోర్కెల్) సర్ వేగాన్ని పెంచమని నన్ను అడిగాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లఖ్​నవూ సూపర్ జెయింట్స్ నెట్స్‌లోనూ బౌలింగ్ చేయడానికి నేను అందుబాటులో ఉండగలనా అని కూడా అడిగార" అంటూ నిశాంత్ చెప్పుకొచ్చాడు. మిచెల్ స్టార్క్​తో పాటు పాట్ కమిన్స్‌లను ఇన్​స్పిరేషన్​గా తీసుకునే ఈ యంగ్​ స్టార్​.. త్వరలో హైదరాబాద్ కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నాడు. ఇక నిశాంత్ తన నెట్ సెషన్స్​లో పాక్​తో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్టార్స్​కు కూడా బౌలింగ్ చేయడం గమనార్హం.

2023 World Cup Warm Up Matches : శుక్రవారం నుంచి వార్మప్ మ్యాచ్​లు షురూ.. లైవ్ స్ట్రీమింగ్, పూర్తి వివరాలు ఇవే!

Pakistan Team In India Photos : వరల్డ్​ కప్​ మేనియా షురూ.. హైదరాబాద్​లో పాక్ టీమ్ సందడి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.