ETV Bharat / sports

ఒక్క మ్యాచ్​లో 578 రన్స్.. యువ బ్యాటర్ రికార్డ్! - cricket news latest

Nihal Vadera: క్రికెట్ మ్యాచ్​లో 578 పరుగలు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు 21 ఏళ్ల యువ బ్యాటర్​. ఇందులో 42 ఫోర్లు, 37 సిక్సర్లు ఉండటం విశేషం. కోహ్లీ, ద్రవిడ్ స్ఫూర్తితోనే తాను క్రికెట్​లో రాణిస్తున్నట్లు చెప్పాడు.

578 runs in district level cricket match
578 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్​
author img

By

Published : Apr 29, 2022, 2:12 PM IST

Cricket News: పంజాబ్​లో 21 ఏళ్ల కుర్రాడు చరిత్ర సృష్టించాడు. క్రికెట్​లో 578 పరుగుల స్కోర్​ చేసి అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అతడే పంజాబ్​కు చెందిన 21 ఏళ్ల నిహాల్ వదేరా. జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో ఈ రికార్డు నమోదు చేశాడు. నాలుగు రోజుల పాటు సాగే ఈ మ్యాచ్​లో నిహాల్ విజృంభణతో అతను ప్రాతినిధ్యం వహిస్తున్న లుథియానా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 880 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్​ చేసింది. నిహాల్ చేసిన 578 పరుగుల్లో 42 ఫోర్లు, 37 సిక్సర్లు ఉండటం విశేషం. అంటే 480కిపైగా పరుగులను అతను బౌండరీలో రూపంలోనే సాధించాడు. లుథియానా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బఠిండా.. స్టంప్స్​ సమయానికి 117/4 స్కోరుతో ఉంది.

తాను ఇంత భారీ స్కోరు సాధిస్తానని అసలు ఊహించలేదని నిహాల్ తెలిపాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 200కుపైగా పరుగులు చేశానని, మహా అయితే ట్రిపుల్ సెంచరీ చేస్తా అని అనుకున్నట్లు చెప్పాడు. కానీ అనూహ్యంగా 578 పరుగులు చేయడం సంతోషంగా ఉందన్నాడు. తనకు విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ అంటే అమితమైన అభిమానం అని, వారి స్ఫూర్తితోనే క్రికెట్లో రాణిస్తున్నట్లు వెల్లడించాడు. నిహాల్​ కోచ్ కూడా అతని ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశాడు. ఇదే ఫాం కొనసాగిస్తే భవిష్యత్​లో మరిన్ని రికార్డులను నిహాల్ కొల్లగొడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

578 runs in district level cricket match
578 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్​

నిహాల్ ఇప్పటికే టీమిండియా అండర్​-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2018 జులైలో శ్రీలంక పర్యటనలో రెండు అర్ధ సెంచరీలు కూడా సాధించి సత్తా చాటాడు. ఈ సిరీస్​లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్​లోనే 81 పరుగులు చేశాడు. 2017-18 కూచ్​ బిహార్​ ట్రోర్నమెంట్​లో అన్ని మ్యాచ్​ల్లో కలిపి నిహాల్​ 540 పరుగులు చేశాడు. అందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్​లో ప్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్​ జట్టు.. నిహాల్​ను ట్రయల్​ కోసం పిలిచింది. కానీ వేలంపాటలో అతడ్ని ఎవరూ తీసుకోలేదు. అయితే రాజస్థాన్ కోచ్​ కుమార సంగక్కరను కలవడం వల్ల తన బ్యాటింగ్ ఎంతో మెరుగుపడిందని నిహాల్ చెప్పాడు.

ఇదీ చదవండి: David Warner: ఐపీఎల్​ చరిత్రలోనే ఏకైక బ్యాటర్​గా వార్నర్ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.