క్రికెట్‌లో అలసత్వం, నిర్లక్ష్యం అసలు పనికిరాదు. ఎంతో చురుగ్గా, తెలివిగా ఆడాలి. లేదంటే మైదానం వీడాల్సిందే. ముఖ్యంగా వికెట్ల మధ్య రన్స్ చేసే సమయంలో కొంచెం అలసత్వం ప్రదర్శించినా వికెట్ సమర్పించుకోవాల్సిందే. అయితే ఈ ఆటలో అటు ప్లేయర్లను, ఇటు అభిమానులను ఎక్కువగా బాధకలిగించే విషయం రనౌట్. ఎందుకంటే ఏ ప్లేయరైనా రనౌట్ అయితే.. ఎదుర్కొనే విమర్శలు, ట్రోల్స్ మాములుగా ఉండవు. సోషల్‌మీడియాలో నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తారు.
రీసెంట్గా ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా సారథి హర్మన్ ప్రీత్ కౌర్ రనౌట్ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆమె రనౌట్ వల్ల.. గెలవాల్సిన మ్యాచ్.. చేజారిపోయినట్టైంది! దీనిపై నెటిజన్లు, మాజీలు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇప్పటికీ నానా హంగామా చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
అయితే ఈ రనౌట్‌ను ఇంకా క్రికెట్ అభిమానులు మర్చిపోవకముందే.. మరో రనౌట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఓ లేజీ రనౌట్ చోటు చేసుకుంది. 158.2వ ఓవర్లో ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్‌లో ఆసీస్ ప్లేయర్ బ్లండెల్ షాట్ కొట్టి.. బ్రేస్‌వెల్‌తో కలిసి రెండు పరుగులు చేశాడు. అయితే, మూడో రన్ చేసే అవకాశం ఉండటంతో మరోసారి వికెట్ల మధ్య పరిగెత్తాడు బ్రేస్‌వెల్. కానీ ఇక్కడ అతడు అలసత్వం ప్రదర్శిస్తూ.. నిర్లక్ష్యంగా పరిగెడుతూ కనిపించాడు. క్రీజ్‌లో బ్యాట్ పెట్టకుండా తన చేత్తోనే పట్టుకుని క్రీజులోకి వెళ్లేందుకు ట్రై చేశాడు. దీన్ని గమనించిన ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బంతిని అందుకుని సూపర్‌స్పీడ్‌తో వికెట్లను తిరగేశాడు. అంపైర్లు రీప్లేలో పరిశీలించి.. బ్రేస్‌వెల్‌కు దిమ్మతిరిగేలా రనౌట్‌ను ప్రకటించారు. దీంతో కివీస్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఇక ఇది చూసిన క్రికెట్ అభిమానులు అతడిని విమర్శిస్తూ ఫుల్ ట్రోల్ చేశారు. ఇంత బద్దకమా, ఇంత ఈజీగా వికెట్ సమర్పించుకోవడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.
కాగా, బ్రేస్‌వెల్ తొలి టెస్టులోనూ 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 209 రన్స్ చేయగా.. ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 435 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 483 పరుగులు చేసి ఫాలో ఆన్ ఆడి.. ప్రత్యర్థి జట్టుకు 258 రన్స్ లక్యాన్ని నిర్దేశించింది. అలా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇంకా 210 పరుగులు చేయాల్సి ఉంది.
-
This is why you run your bat in 😬
— Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A wicket manufactured from out of nowhere! #NZvENG pic.twitter.com/i52FQVyw2H
">This is why you run your bat in 😬
— Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023
A wicket manufactured from out of nowhere! #NZvENG pic.twitter.com/i52FQVyw2HThis is why you run your bat in 😬
— Cricket on BT Sport (@btsportcricket) February 27, 2023
A wicket manufactured from out of nowhere! #NZvENG pic.twitter.com/i52FQVyw2H
ఇదీ చూడండి: శార్దూల్ పెళ్లిలో శ్రేయస్ అయ్యర్ హంగామా!