ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్(WTC final) ముంగిట ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడడం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశమనేనని భారత బ్యాట్స్‌మన్ ఛెతేశ్వర్ పుజారా(Pujara) అన్నాడు. అయితే తమకు లభించిన కొద్ది సమయంలోనే ఫైనల్‌కు భారత్ మెరుగ్గా సన్నద్ధమవుతుందని చెప్పాడు.
"ఫైనల్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడడం న్యూజిలాండ్‌కు నిస్సందేహంగా లాభించే అంశమే. కానీ మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేస్తాం. బాగా ఆడి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకునే సత్తా మా జట్టుకు ఉందని మాకు తెలుసు. ఇంగ్లాండ్‌లో ఒకే రోజు పరిస్థితులు భిన్న రకాలుగా ఉంటాయి. వాటికి అలవాటు పడటమే మాకు పెద్ద సవాలు. వర్షం పడుతుంది. మనం మైదానాన్ని వీడి వెళ్లగానే ఉన్నట్లుండి చినుకులు ఆగిపోతాయి. మళ్లీ వెంటనే తిరిగి రావాలి. ఈ విరామాల మధ్య ఆడటానికి మానసికంగా ఎంతో బలంగా ఉండాలి". అని పుజారా అన్నాడు.
ఇదీ చూడండి: WTC Final: బౌల్ట్ బౌలింగ్‌లో రోహిత్ ఎలా ఆడతాడో?