ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ముందు పర్యటక న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మోచేతి గాయం కారణంగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్వ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. టామ్ లాథమ్ జట్టును ముందుండి నడిపించనున్నాడు.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది న్యూజిలాండ్. చూపుడు వేలు గాయంతో స్పిన్నర్ శాంటర్న్ కూడా రూట్ సేనతో తుది టెస్టుకు దూరమయ్యాడు. జూన్ 10 నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.
ఇదీ చదవండి: 'సచిన్‌ను తొలిసారి చూసి చిన్నపిల్లాడు అనుకున్నా'