ETV Bharat / sports

IPL New Team: ఐపీఎల్​లో కొత్త జట్లు.. ఫార్మాట్​లో మార్పులివే? - ipl broadcasting rights

ఐపీఎల్​లో(ipl new team auction) అహ్మదాబాద్​, లఖ్​నవూ రెండు కొత్త జట్లను చేరుస్తూ బీసీసీఐ అక్టోబర్​ 25న నిర్ణయం తీసుకుంది. అయితే(ipl new team 2022) ఈ కొత్త జట్లు చేరడం వల్ల ఎవరు ప్రయోనం పొందుతారు? వీటి రాకతో ఐపీఎల్​ ఫార్మాట్​పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆసలు ఈ మెగాలీగ్​లో జట్ల సంఖ్య ఎప్పుడు పెరిగింది? వంటి విశేషాలను తెలుసుకుందాం..

ipl
ఐపీఎల్​
author img

By

Published : Oct 26, 2021, 6:21 PM IST

Updated : Oct 26, 2021, 6:57 PM IST

ఐపీఎల్(ipl new team news)​.. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్​ అభిమానులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. 2008లో తొలి సీజన్​ ఎనిమిది జట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత పలు కొత్త ఫ్రాంచైజీలు చేరడం, నిష్క్రమించడం జరిగింది. మొత్తంగా 2021కు వరకు ఎనిమిది జట్లు ఉండగా.. అనంతరం 2022 సీజన్​లో మరో రెండు కొత్త జట్లను చేర్చేందుకు ఇటీవల బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. ఈ క్రమంలోనే అక్టోబర్​ 25న(ipl new team announcement).. బిడ్లు గెలిచిన ఆహ్మదాబాద్(సీవీసీ క్యాపిటల్స్‌ పార్టనర్స్‌, రూ.5,625 కోట్లు)​, లఖ్​నవూ(ఆర్పీఎస్జీ గ్రూప్‌, రూ.7,090 కోట్లు) అనే రెండు కొత్త ఫ్రాంచైజీలు(IPl new team names) ఈ మెగాలీగ్​ వచ్చి చేరాయి.

అయితే(ipl new team price) ఈ కొత్త జట్లు చేరడం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు? వీటి రాకతో ఐపీఎల్​ ఫార్మాట్​పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆసలు ఈ మెగాలీగ్​లో జట్ల సంఖ్య ఎప్పుడు పెరిగింది? వంటి విశేషాల సమాహారమే ఈ కథనం..

ఎవరికి ప్రయోజనం?

జట్లు పెరగడం వల్ల మ్యాచ్​ల సంఖ్య(60-74కు), నిర్వహణ రోజులు పెరుగుతాయి. దీంతో ప్రేక్షకులకు మరింత వినోదం అందుతుంది. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు దాదాపు 50 మంది కొత్త ఆటగాళ్లకు అవకాశం కలుగుతుంది. వీరిలో 30 మంది వరకు భారత యువ ఆటగాళ్లు ఉంటారు.

ఎక్కువ మ్యాచ్​ల వల్ల రాబోయే ఐదేళ్లకు ఐపీఎల్​ ప్రసార హక్కులు రికార్డు​ ధర​ పలికే అవకాశముంటుంది(ipl broadcasting rights 2022). దీంతో బీసీసీఐ రూ.35 నుంచి 40 వేల కోట్ల ఆదాయం పొందనుందని తెలుస్తోంది! 2018 నుంచి 2022 వరకు బీసీసీఐ ఈ హక్కులను(ipl broadcasting rights) స్టార్​ ఇండియాకు రూ.16,347.50 కోట్లకు విక్రయించింది.

ఫార్మాట్​పై ప్రభావం?(ipl format)

ఐపీఎల్​లో(ipl format 2022) కొత్త జట్ల రాకతో ప్రస్తుత ఫార్మాట్​పై కాస్త ప్రభావం చూపొచ్చు. పది జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి. ఒక గ్రూపులోని ఒక జట్టు అదే గ్రూప్​లోని మిగతా నాలుగు టీమ్స్​తో రెండు సార్లు తలపడతాయి. ఒక మ్యాచ్​ సొంత మైదానంలో, మరో మ్యాచ్ ప్రత్యర్థి జట్టు మైదానంలో జరుగుతుంది. అంటే సొంత గ్రూపులో మొత్తం ఎనిమిది మ్యాచ్​లు ఆడాల్సి ఉంటుంది. అలానే రెండో గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్​ ఆడుతుంది. మిగిలిన ఒక్క జట్టుతో రెండు సార్లు పోటీ పడుతుంది. దీని కోసం డ్రా ఉంటుంది. దీనిలో ఎవరు ఎప్పుడు, ఎవరితో ఆడనున్నారో వెల్లడిస్తారు. ఈ విధంగా లీగ్​ దశలో మొత్తం 70 మ్యాచ్​లు జరగుతాయి. క్వాలిఫయర్, ఎలిమినేటర్ (2), ఫైనల్​తో కలిపి మొత్తం 74 మ్యాచ్​లు జరుగుతాయి. 2011 సీజన్​లోనూ ఇదే ఫార్మాట్​ను అనుసరించారు. అప్పుడు కొచ్చి టస్కర్స్​, పుణె వారియర్స్​ చేరిక వల్ల పది జట్లతో టోర్నీని నిర్వహించారు. తర్వాత వివిధ కారణాల వల్ల ఈ రెండు జట్లు లీగ్ నుంచి నిష్క్రమించాయి.

ఎప్పుడెప్పుడు జట్లు పెరిగాయంటే?

2008లో ఎనిమిది జట్లతో లీగ్ ప్రారంభమైంది. 2011లో తొలిసారి రెండు కొత్త టీమ్స్​ను ఐపీఎల్​లో చేర్చారు. కొచ్చి టస్కర్స్​ కేరళ, పుణె వారియర్స్​ ఈ మెగాలీగ్​లో భాగమయ్యాయి. ఆ తర్వాత 2012, 2013లో తొమ్మిది జట్లు పాల్గొన్నాయి. 2014లో పుణె వారియర్స్​ వైదొలగగా జట్ల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.

2016లో మ్యాచ్​ ఫిక్సింగ్​ కారణంగా చెన్నై సూపర్​ కింగ్స్(సీఎస్కే)​, రాజస్థాన్​ రాయల్స్(ఆర్​ఆర్​) నిషేధానికి గురయ్యాయి. వీటికి బదులుగా రైజింగ్​ పుణె సూపర్​జెయింట్స్​, గుజరాత్​ లయన్స్​ వచ్చి చేరాయి. అనంతరం సీఎస్కే, ఆర్​ఆర్​పై నిషేధం ఎత్తివేయగానే.. రైజింగ్​ పుణె, గుజరాత్​ లయన్స్​ మెగాలీగ్​ నుంచి తప్పుకొన్నాయి. ​

ఇదీ చూడండి: IPL New Team: కొత్త ఫ్రాంచైజీలుగా అహ్మదాబాద్, లఖ్​నవూ

Last Updated : Oct 26, 2021, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.