Netizens fire on Ruturaj: టీమ్ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ముగిసింది. దీంతో మ్యాచ్‌ను రద్దు అవ్వగా సిరీస్ సమంగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా అతడిపై విమర్శలు కురిపిస్తున్నారు. వర్షం పడినప్పుడు విరామ సమయంలో అతడు గ్రౌండ్ స్టాఫ్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. ఓ సిబ్బంది.. డగౌట్లో ఉన్న గైక్వాడ్ పక్కనే కూర్చుని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించగా.. అతడిని నెట్టేశాడు. వెళ్లిపోమంటూ చేతులు ఊపాడు. ఇది కెమెరాల్లో రికార్డైంది. గైక్వాడ్.. అమర్యాదగా ప్రవర్తించడం అభిమానులకు నచ్చలేదు. దీంతో అతడిని విమర్శిస్తూ.. మ్యాచ్‌లో రుతురాజ్ కన్నా ఎక్కువగా గ్రౌండ్ స్టాఫ్ ఎక్కువగా కష్టపడ్డారని గుర్తు చేస్తున్నారు.
-
Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX
— Arnav (@imarnav_904) June 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX
— Arnav (@imarnav_904) June 19, 2022Very bad and disrespectful gesture by Ruturaj Gaikwad. Sad to see these groundsmen getting treated like this 😔#RuturajGaikwad pic.twitter.com/jIXWvUdqIX
— Arnav (@imarnav_904) June 19, 2022
Netizens fire on Medvedev: రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మెద్వెదేవ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అతడిపై మండిపడుతున్నారు. మైదానంలో అతడు తన కోచ్‌పై అరవడమే ఇందుకు కారణం. ఆదివారం జర్మనీలో జరిగిన హాలే ఓపెన్ ఫైనల్లో పోలాండ్ ఆటగాడు హుబర్ట్ హుర్కాజ్ చేతిలో 6-1, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు మెద్వెదేవ్. దీంతో ఈ ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు గ్రాస్ కోర్ట్ ఫైనల్లో వరుసగా రెండోసారి విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన ఈవెంట్‌లో మెద్వెదేవ్ ఒక్కసారిగా తన కోచ్ గైల్స్ సెర్వెరాపై కోర్టులోనే గట్టిగా అరిచాడు. దీంతో ఆ కోచ్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను టెన్నిస్ టీవీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం వల్ల అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు మెద్వెదేవ్ తీరుపై మండిపడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: టీ20 ప్రపంచకప్‌లో పంత్-దినేశ్ కార్తిక్.. ద్రవిడ్ రియాక్షన్