Naveen Ul Haq Ban : అఫ్గానిస్థాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్‌పై వేటు పడింది. అతడిపై ఇంటర్నేషనల్ టీ20 (ILT20) లీగ్ నిర్వాహకులు 20నెలల నిషేధం విధించారు. అతడు టోర్నమెంట్‌లోని షార్జా వారియర్స్ జట్టుతో ఉన్న అగ్రిమెంట్ రూల్స్ బ్రేక్ చేసినందుకు ఈ నిషేధం విధిస్తున్నట్లు టోర్నమెంట్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.
ఇదీ జరిగింది : యూఏఈ క్రికెట్ బోర్డు ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 పేరుతో ఓ టోర్నీకి శ్రీకారం చుట్టింది. దుబాయ్ వేదికగా ఈ టోర్నీ నిర్వహణ జరుగుతోంది. అయితే ఈ ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి టోర్నీలో నవీన్ ఉల్ హక్, షార్జా వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. లీగ్ నిబంధనల ప్రకారం అతడి కాంట్రాక్ట్‌ను వచ్చే సీజన్‌కు కూడా పొడగించిన ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ రిటెన్షన్ అగ్రిమెంట్ పంపింది. అయితే నవీన్ ఆ అగ్రిమెంట్‌పై నవీన్ సంతకం చేయడానికి నిరాకరించాడు. దీంతో అతడిపై క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని లీగ్ కమిటీ తెలిపింది. దీంతో నవీన్ 2024, 2025 సీజన్లలో ఆడడానికి అనర్హుడు. కాగా, నవీన్ ఈ ఏడాది ఇదే లీగ్‌లో 11 వికెట్లు పడగొట్టాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన కూడా ఉంది.
-
Naveen-ul-Haq faces a 20-month ban by ILT20 for breaching the contract to participate in any T20 league. 🚫🏏 #IPLAuction2024 #ILT20 #CricketTwitter pic.twitter.com/8IXukINBKQ
— Sahib Singh (@singh28915) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Naveen-ul-Haq faces a 20-month ban by ILT20 for breaching the contract to participate in any T20 league. 🚫🏏 #IPLAuction2024 #ILT20 #CricketTwitter pic.twitter.com/8IXukINBKQ
— Sahib Singh (@singh28915) December 18, 2023Naveen-ul-Haq faces a 20-month ban by ILT20 for breaching the contract to participate in any T20 league. 🚫🏏 #IPLAuction2024 #ILT20 #CricketTwitter pic.twitter.com/8IXukINBKQ
— Sahib Singh (@singh28915) December 18, 2023
అందుకే అగ్రిమెంట్‌కు నో! : నవీన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ టోర్నీలో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఇంటర్నేషనల్ టీ20, సౌతాఫ్రికా టీ20 రెండు టోర్నీలు కూడా దాదాపు ఒకే నెలలో జరగాల్సి ఉంది. అందుకే నవీన్ షార్జా వారియర్స్ అగ్రిమెంట్‌ను తిరస్కరించి, సౌతాఫ్రికా టోర్నీనే ఎంచుకున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.
-
The main reason for Naveenulhaq’s 20 month ban in #ILT20 could be that he chose to play #SA20 instead. #AfghanAtalan pic.twitter.com/yHAO2aCT9B
— Afghan Cricket Association - ACA (@ACAUK1) December 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The main reason for Naveenulhaq’s 20 month ban in #ILT20 could be that he chose to play #SA20 instead. #AfghanAtalan pic.twitter.com/yHAO2aCT9B
— Afghan Cricket Association - ACA (@ACAUK1) December 18, 2023The main reason for Naveenulhaq’s 20 month ban in #ILT20 could be that he chose to play #SA20 instead. #AfghanAtalan pic.twitter.com/yHAO2aCT9B
— Afghan Cricket Association - ACA (@ACAUK1) December 18, 2023
ఆ సంఘటనతో ఫేమస్ : ఈ ఏడాది ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్, నవీన్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఐపీఎల్ నిబంధనలు ఉల్లంఘించారని వీరికి జరిమానా కూడా విధించింది యాజమాన్యం. ఇక కొన్ని నెలలపాటు కొనసాగిన ఈ వివాదానికి తాజా వరల్డ్‌కప్‌లో ఎండ్ కార్డ్ పడింది.
ఆ రోజు నా తప్పేం లేదు.. కోహ్లీయే గొడవపడ్డాడు: నవీనుల్ హక్
విరాట్-గంభీర్ కాంట్రవర్సీ.. మధ్యలో ఈ నవీన్ ఉల్ హక్ ఎవరబ్బా?