Mumbai Indians Captain 2024 : ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ట్రేడింగ్‌లో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో 2024 ఐపీఎల్ నుంచి పాండ్య ముంబయికి సారధ్యం వహించనున్నాడు. కాగా, ఈ విషయాన్ని జట్టు కోచ్ మహేల జయవర్దనే తెలిపాడు. 'ముంబయి ఇండియన్స్ పద్ధతులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి హార్దిక్ ముంబయి జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి మా కృతజ్ఞతలు. 2013 సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా అతడి సేవలు అద్భుతం. ఐపీఎల్ హిస్టరీలోనే రోహిత్ బెస్ట్ కెప్టెన్' అని జయవర్దనే అన్నాడు. కాగా, సచిన్ తెందూల్కర్, హర్బజన్ సింగ్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ ముంబయికి ఐదో కెప్టెన్.
ప్లేయర్ టు కెప్టెన్ : 2015లో ఓ సాధారణ ప్లేయర్‌గా ఐపీఎల్లో హార్దిక్ ముంబయి ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. తక్కువ కాలంలోనే జట్టులో అత్యుత్తమ ప్లేయర్‌గా ఎదిగాడు హార్దిక్. తన అసాధారణ ఆటతో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ ముంబయికి అనేక విజయాలు కట్టబెట్టాడు. అతడు 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబయి ఛాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడు. ఇక 2022 సీజన్లో అతడు కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. అదే సీజన్లో గుజరాత్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన హార్దిక్, తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా 2023 సీజన్లోనూ గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చిన ఈ కెప్టెన్, రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక గతనెల డైరెక్ట్ ట్రేడింగ్‌లో హార్దిక్ తిరిగి ముంబయి గూటికి చేరాడు.
-
To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023
10 సీజన్లలో 5 టైటిళ్లు : 2013 సీజన్ మధ్యలో రికీ పాంటింగ్ నుంచి రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అదే సీజన్లో ముంబయిని ఛాంపియన్‌గా నిలిపాడు రోహిత్. అప్పటి నుంచి సుదీర్ఘంగా పదేళ్లపాటు రోహిత్ ముంబయిని ముందుండి నడిపాడు. ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని విధంగా రోహిత్ 5సార్లు ముంబయిని ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా 2023 సీజన్‌తో ఎంఎస్ ధోనీ కూడా చెన్నైకి 5 టైటిళ్లు అందించి రోహిత్‌తో సమానంగా నిలిచాడు.
గుజరాత్‌కు ఇక సెలవు - ముంబయి గూటికి హార్దిక్ - డీల్ ఎలా కుదిరిందంటే?
వరల్డ్ కప్ 2023 - 'హార్దిక్ ప్లేస్‌లో ప్రసిద్ధ్‌ను అందుకే తీసుకున్నాం'