భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. టీమ్ఇండియా రెట్రో జెర్సీలో కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ధోనీ ధరించిన జెర్సీ.. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కోసం డిజైన్ చేసిన జెర్సీలా ఉంది.
![MS Dhoni spotted in Retro Indian jersey ahead of IPL 2021 resumption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12582408_dhoni.jpg)
![MS Dhoni spotted in Retro Indian jersey ahead of IPL 2021 resumption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12582408_dhoni_1.jpg)
ఫుట్‌బాలర్‌గా..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న టీమ్ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఇప్పుడు ఫుట్‌బాలర్ అవతారమెత్తాడు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌తో కలిసి ఆడాడు. మ్యాచ్‌కు సంబంధించిన ఫొటోలను హీరో రణ్వీర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అయితే ధోనీ ఎప్పటికీ తన అభిమాన ఆటగాడేనని అందులో పేర్కొన్నాడు. ధోనీ కోసమే తాను ఓ యాడ్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు రణ్వీర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
![MS Dhoni spotted in Retro Indian jersey ahead of IPL 2021 resumption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12582408_dhoni_3.jpg)
![MS Dhoni spotted in Retro Indian jersey ahead of IPL 2021 resumption](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12582408_dhoni_4.jpg)
"ధోనీ ఓ యాడ్‌లో నటిస్తున్నాడని తెలిసి.. కేవలం అతని కోసమే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాను. ధోనీ ప్రపంచంలోనే గొప్ప క్రీడాకారుడు. ఆయన తరంలో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం. ఆయనో అద్భుతం. ఓ స్పోర్ట్ ఐకాన్. ఎప్పటికీ ఆయనే నా హీరో".
- రణ్వీర్ సింగ్, బాలీవుడ్ హీరో
రణ్వీర్ సింగ్ నటించిన కపిల్‌దేవ్ బయోపిక్ '83' విడుదలకు సిద్ధంగా ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది.
ఇదీ చూడండి.. Tokyo Olympics: ఈ ఒలింపిక్స్‌లో రష్యా కనిపించలేదేంటి!