ETV Bharat / sports

Dhoni: భార్యకు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే? - Dhoni sakhsi marriage day

పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్​ ఇచ్చిన మాజీ కెప్టెన్ ధోనీ.. భార్య సాక్షిని సర్​ప్రైజ్ చేశాడు. ఇంతకీ ఆ బహుమతి ఏంటి? అసలు వీళ్ల ప్రేమకథేంటి?

dhoni
ధోనీ
author img

By

Published : Jul 4, 2021, 7:20 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, సాక్షిమాలిక్(Dhoni-Sakshi) దంపతుల​ వివాహ వార్షికోత్సం ఆదివారం(జులై 4). మూడేళ్లపాటు ప్రేమించుకుని పెళ్లితో ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా భార్యకు ఓ మధురమైన బహుమతిని ఇచ్చాడు మహీ.

dhoni
ధోనీ, సాక్షి

మహీకి కార్లు, బైకులు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో విలాసవంతమైన వాహనాలను కొనుగోలు చేసిన అతడు.. వివాహ వార్షికోత్సం సందర్భంగా తన భార్యకు ప్రత్యేకంగా ఓ వింటేజ్​ కారును కానుకగా ఇచ్చాడు. లేత నీలం, తెలుపు రంగు కాంబినేషన్​లో​ ఉన్న ఆ కారు.. నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోను సాక్షి.. ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసింది. దీంతోపాటే వీరిద్దరు కలిసి దిగిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. వీరిద్దరికి కూతురు జీవా ఉంది. ప్రస్తుతం వీరి కుటుంబం విహారయాత్రలో ఎంజాయ్​ చేస్తోంది.

dhoni
వింటేజ్​ కారు

అలా ప్రేమలో

ధోనీ, సాక్షి తండ్రులు ఇద్దరు ఒకేచోట కలిసి పనిచేసేవారు. అలా వీరిద్దరు కూడా ఒకేచోట కలిసి చదువుకున్నారు. అయితే మహీ మాత్రం సాక్షికి సీనియర్​. కానీ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఆ తర్వాత సాక్షి తండ్రికి ఉద్యోగం బదిలీ అవ్వడం వల్ల వేరే చోటుకు తమ మకాం మార్చారు. దీంతో వీరు చాలా కాలం దూరంగానే ఉన్నారు.

dhoni
ధోనీ కుటుంబం

2007లో అనుకోకుండా ఓ కామన్​ స్నేహితుడి ద్వారా వీరిద్దరు మళ్లీ కలుసుకున్నారు. అప్పటికే మహీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అదే సమయంలో సాక్షి ఓ హోటల్​లో ఇంటర్న్​షిప్​ చేస్తోంది. అనుకోకుండా ఓ రోజు మ్యాచ్​లో భాగంగా అదే హోటల్​లో బసకు దిగారు టీమ్​ఇండియా ఆటగాళ్లు. అయితే సాక్షికి తెలియకుండా ఆ హోటల్​ మేనేజర్​ దగ్గర నుంచి ఆమె ఫోన్​ నెంబరు తీసుకుని తనకు మెసేజ్​లు చేయడం ప్రారంభించాడు ధోనీ. అలా క్రమక్రమంగా వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీరిద్దరు 2008లో ప్రేమలో పడ్డారు. అప్పటికే పలువురు బాలీవుడ్​ భామలతో ధోనీకి అఫైర్స్ నడుస్తున్నట్లు చాలా పుకార్లు కూడా వచ్చాయి. కానీ వాటన్నింటికి చెక్​ పెడుతూ 2010లో జులై 4న సాక్షిని పెళ్లి చేసుకున్నాడు మహీ.

ఇదీ చూడండి: అలా ధోనీ, సాక్షి ప్రేమలో పడ్డారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.