ETV Bharat / sports

ఒకే జట్టుపై అత్య‌ధిక సెంచ‌రీల లిస్ట్​లో మనోళ్లదే హవా.. ఆ దేశంపై విరాట్, రోహిత్, సచిన్ పూర్తి డామినేషన్

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 10:49 PM IST

Most Odi Hundreds Against One Team : క్రికెట్​లో సెంచ‌రీల‌కున్న ప్రాముఖ్యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శతకాలు సాధించ‌డం ప్ర‌తి బ్యాట‌ర్ క‌ల‌. సాధ్య‌మైతే ఆడిన ప్ర‌తి మ్యాచ్ లో ఇన్నింగ్స్​ను సెంచరీలుగా మలచాలని బ్యాటర్లు ఆరాట‌ప‌డుతుంటారు. ఈ క్రమంలో కొంద‌రు ఆట‌గాళ్లు ఒకే జట్టుపై అత్య‌ధిక సెంచ‌రీలు సాధించారు. మరి వారెవ‌రు ఏ జట్టుపై ఈ ఘనత సాధించారో తెలుసుకుందాం.

Most Odi Hundreds Against One Team
Most Odi Hundreds Against One Team

Most Odi Hundreds Against One Team : క్రికెట్​లో ప్రతీ బ్యాట‌ర్​కి కెరీర్​లో వీలైన‌న్ని ఎక్కువ సెంచ‌రీలు చేయాలనేది ఒక క‌ల‌. సాధ్య‌మైతే.. తాను ఆడిన అన్ని మ్యాచుల్లోనూ శతకం సాధించాలని ఆటగాళ్లు కోరుకుంటారు. అలా చాలా మంది బ్యాటర్లు.. దాదాపుగా ప్ర‌తి జ‌ట్టుపై సెంచ‌రీలు చేస్తారు. కానీ కొందరు.. మాత్రం ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక శ‌త‌కాలు బాది రికార్డు కొట్టారు. మ‌రి ఆ ఆట‌గాళ్లు ఎవ‌రు.. వారు ఏ జ‌ట్టుపై ఎన్ని సెంచ‌రీలు సాధించారు? అనే అంశాలు తెలుసుకుందాం.

  1. విరాట్ కోహ్లీ - శ్రీ‌లంక‌
    విరాట్ కోహ్లీ త‌న అద్భుత‌మైన పెర్ఫార్మెన్స్​తో టీమ్ఇండియాకు మూడు ఫార్మాట్ల‌లోనూ అనేక విజ‌యాలు కట్టబెట్టాడు. ఈ క్రమంలో వ్య‌క్తిగ‌తంగానూ విరాట్.. అనేక రికార్డులు నెల‌కొల్పాడు. అందులో ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్ట‌డం కూడా ఒక‌టి. అతడు శ్రీ‌లంక జ‌ట్టుపై 10 శ‌తకాలు బాదాడు. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన బ్యాట‌ర్​గా రికార్డు సృష్టించాడు.
  2. విరాట్ కోహ్లీ - వెస్టిండీస్‌
    త‌న బ్యాటింగ్​తో ప్రత్యర్థులపై విరుచుకుప‌డే విరాట్‌.. ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మాట్​లో క‌రీబియ‌న్ జ‌ట్టుపైనా ఘనమైన రికార్డు సాధించాడు. విండీస్​తో ఇప్ప‌టిదాకా 43 వ‌న్డే మ్యాచ్​లు ఆడిన విరాట్.. 9 సార్లు 100+ స్కోర్లు నమోదు చేశాడు.
  3. స‌చిన్ - ఆస్ట్రేలియా
    టీమ్ఇండియా దిగ్గజం, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ తెందూల్కర్​.. అంత‌ర్జాతీయ క్రికెట్​లో అత్య‌ధిక రికార్డుల్ని త‌న పేరిట లిఖించుకున్నాడు. అధిక మ్యాచ్​లు ఆడ‌టం, సెంచ‌రీలు సాధించ‌డం లాంటివి కూడా ఆ జాబితాలో ఉన్నాయి. అయితే.. స‌చిన్ కూడా ఒకే జ‌ట్టుపై అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన ఘనత సాధించాడు. అతడు 5 సార్లు ప్ర‌పంచక‌ప్ విజేత ఆస్ట్రేలియాపై 9 శ‌త‌కాలు బాదాడు. వీటితో పాటు అనేక గుర్తుంచుకోద‌గిన ఇన్నింగ్స్ ఆడాడు.
  4. రోహిత్ శ‌ర్మ - ఆస్ట్రేలియా
    ప్ర‌స్తుత టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు కంగారూ జ‌ట్టుపై మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా వ‌న్డే ఫార్మాట్లో ఆ జ‌ట్టుపై మంచి ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఆసీస్​పై రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు 8 శతకాలు బాదాడు. స‌చిన్ త‌ర్వాత కంగారూ జ‌ట్టుపై ఇన్ని సెంచ‌రీలు సాధించిన రెండో ఆట‌గాడిగా నిలిచాడు రోహిత్‌. ఇక వన్డే కెరీర్​లో రోహిత్ 30 సెంచరీలు బాదాడు.
  5. విరాట్ కోహ్లీ - ఆస్ట్రేలియా
    ర‌న్ మషీన్ విరాట్.. కంగారూల‌పైనా మంచి రికార్డుల్ని సొంతం చేసుకున్నాడు. సచిన్, రోహిత్ త‌ర్వాత విరాట్ ఆ జ‌ట్టుపై మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసి ఆక‌ట్టుకున్నాడు. ఆ జట్టుపై విరాట్ ఇప్ప‌టిదాకా 8 శ‌త‌కాలు చేసి రోహిత్ శ‌ర్మ‌తో స‌మానంగా నిలిచాడు. ఇక వన్డేల్లో విరాట్ ఇప్పటివరకూ 46 శతకాలు సాధించి సచిన్ (49) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.