ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali Retirement) అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సోమవారం(సెప్టెంబరు 27) నుంచి క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మొయిన్ అలీ ఓ ప్రకటనలో తెలిపాడు. ఇదే విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ECB News) ధ్రువీకరించింది.
ఈ సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు తరఫున ఇప్పటివరకు 64 మ్యాచ్‌లకు మొయిన్ అలీ ప్రాతినిధ్యం వహించాడు. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్(ICC T20 Worldcup 2021), ఏడాది చివర్లో యాషెస్ సిరీస్ కారణంగా మరికొన్ని నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సిఉంది. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ ఈ నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది. ఇదే విషయమై ఇంగ్లాండ్ జట్టు కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్, టెస్టు కెప్టెన్ జో రూట్లకు తన నిర్ణయాన్ని తెలియజేసినట్లు ఈసీబీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా.. వైట్ క్రికెట్లో తన కెరీర్‌ను కొనసాగించాలని మొయిన్ అలీ భావిస్తున్నట్లు సమాచారం.
మొయిన్ అలీ.. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతోన్న ఐపీఎల్లో(IPL 2021) పాల్గొన్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు(Moeen Ali CSK News) తరఫున మొయిన్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 64 టెస్టుల్లో(Moeen Ali Test Career) ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మొయిన్ అలీ.. 28.29 సగటుతో 2,914 పరుగులు రాబట్టాడు. అత్యధికంగా 155 రన్స్ నమోదు చేశాడు. అదే విధంగా స్పిన్‌బౌలింగ్ వేస్తూ.. 195 వికెట్లను పడగొట్టాడీ ఆల్‌రౌండర్.
ఇదీ చూడండి.. IPL 2021: హ్యాట్రిక్‌తో ముంబయికి చుక్కలు చూపించిన హర్షల్