ETV Bharat / sports

ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ

author img

By

Published : Jul 6, 2021, 3:28 PM IST

Updated : Jul 6, 2021, 9:03 PM IST

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్​ అగ్రస్థానానికి చేరింది. దాదాపు మూడేళ్ల తర్వాత మహిళల వన్డే ర్యాంకింగ్స్​లో టాప్​-1కు దూసుకొచ్చింది. టీ20 ర్యాంకింగ్స్​లో షెఫాలీ వర్మ తొలి ర్యాంకును దక్కించుకుంది.

mithali
మిథాలీ, షెఫాలీ వర్మ

మంగళవారం అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ICC)​ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్​ బ్యాటింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరింది టీమ్​ఇండియా మహిళా జట్టు కెప్టెన్​ మిథాలీ రాజ్​(Mithali Raj). నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 762 పాయింట్లతో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ వన్డే బ్యాటింగ్​ ర్యాంకింగ్స్​లో టాప్​కు ఎగబాకింది. తన 22 ఏళ్ల కెరీర్​లో ఎనిమిదో సారి ఈ ఘనత సాధించడం విశేషం. మరో స్టార్​ బ్యాట్స్​ఉమన్​ స్మృతి ఇరానీ.. 701 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

rankings
బ్యాటింగ్ విభాగం

బౌలింగ్ విభాగంలో జూలన్​ గోస్వామి(694 పాయింట్లు, 4వ స్థానం), పూనమ్​ యూదవ్​(617 పాయింట్లు, 9 స్థానం) తమ ర్యాంకుల్లో నిలిచారు. అయితే బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా క్రికెటర్లు జెస్​ జొనాస్సెన్​ (808 పాయింట్లు), మేఘన్​ షట్​(762 పాయింట్లు) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

rankings
బౌలింగ్​ విభాగం

ఆల్​రౌండర్ల విభాగంలో టీమ్​ఇండియా మహిళా క్రికెటర్​ దీప్తి శర్మ(331 పాయింట్లు) ఐదో ర్యాంకును దక్కించుకోగా.. మరిజన్నె కప్​ (దక్షిణాఫ్రికా), ఎల్లిసా పెర్రి(ఆస్ట్రేలియా) తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

టీ20 ర్యాంకింగ్స్​

టీ20 ర్యాంకింగ్స్​ బ్యాటింగ్​ విభాగంలో టాప్​ -10లో ఇద్దరు భారత మహిళా క్రికెటర్లకు చోటు దక్కింది. అగ్రస్థానంలో షెఫాలీ వర్మ(776 పాయింట్లు), స్మృతి మంధాన(693) నాలుగో ర్యాంకుల్లో నిలిచారు. బౌలింగ్​ విభాగంలో దీప్తి శర్మ(705), రాధా యాదవ్​(702) ఐదు, ఆరు స్థానాలను కైవసం చేసుకున్నారు. ఆల్​రౌండర్​ విభాగంలో దీప్తి శర్మ.. 304 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉంది. సోఫీ డివైన్​ (న్యూజిలాండ్​, 359 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుంది.

shefali varma
షెఫాలీ వర్మ

ఇదీ చూడండి: Mithali Raj: మహిళల క్రికెట్​లో మరో సచిన్​

Last Updated : Jul 6, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.