Mithali Raj Birthday : టీమ్ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 20 ఏళ్లకు పైగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె సుదీర్ఘ ప్రయాణంలో జట్టుకు అనేక చారిత్రక విజయాలు కట్టబెట్టింది. ఆమె నాయకత్వంలో టీమ్ఇండియా.. మూడు ఫార్మాట్లలో అదరగొట్టింది. ఇక గతేడాది జూన్‌లో మిథాలీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పింది. 2022లో ఆమె బయోపిక్ కూడా 'శభాష్ మిథు' తెరకెక్కింది. ఈ బయోపిక్‌లో మిథాలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించారు. ఇక నేడు (డిసెంబర్ 3) ఆమె బర్త్ డే సందర్భంగా.. మిథాలీ సాధించిన కొన్ని ఘనతలేంటో చూద్దాం.
- 1999లో మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టింది.
- అన్ని ఫార్మాట్లలో కలిపి మిథాలీ 333 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది.
- మూడు ఫార్మాట్లలో ఆమె 10868 పరుగులు సాధించింది. అందులో 8 సెంచరీలు, 85 ఫిఫ్టీలు ఉన్నాయి.
- మహిళల టెస్టు క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అతిపిన్న వయస్కురాలిగా మిథాలీ రికార్డు కొట్టింది.
- మిథాలీ సారధ్యంలో టీమ్ఇండియా రెండుసార్లు వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ ఆడింది.
- మహిళా వరల్డ్‌కప్‌లో ఎక్కువ ఎడిషన్లలో పాల్గొన్న ప్లేయర్ మిథాలీనే. ఆమె ఏకంగా ఆరుసార్లు (2000, 2005, 2009, 2013, 2017, 2022) ఆడింది.
- వన్డే వరల్డ్‌కప్‌లో టీమ్ఇండియాను రెండుసార్లు ఫైనల్ చేర్చిన కెప్టెన్ మిథాలీయే.
World Cup 2005 Women's : 2005 వరల్డ్‌కప్‌లో మిథాలీ టీమ్ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ టోర్నమెంట్లో లీగ్ దశలో భారత్.. నాలుగు విజయాలతో సెమీస్‌లో ఆడుగుపెట్టింది. ఇక సెమీస్‌లో న్యూజిలాండ్‌పై మిథాలీ 91 పరుగులు నాటౌట్‌గా నిలిచి.. టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్.. కీవీస్‌పై 40 పరుగుల తేడాతో నెగ్గి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టిన మిథాలీ సేన.. 98 పరుగుల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
World Cup 2017 Women's : 2017 ప్రపంచకప్‌లోనూ భారత్.. మిథాలీ సారథ్యంలో ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడ్డ టీమ్ఇండియా.. విజయం అంచుల దాకా వచ్చి 9 పరుగుల తేడాతో టైటిల్ చేజార్చుకుంది. ఇంగ్లాండ్ 228 పరుగులు చేయగా.. టీమ్ఇండియా 219 పరుగులకు ఆలౌటైంది. మిథాలీ సారథ్యంలో టీమ్ఇండియా రెండుసార్లు ఫైనల్ చేరినా.. భారత్ ఛాంపియన్దా నిలవలేకపోయింది.
-
Thank you Paltan. 👍 https://t.co/ZA7dYDEfTG
— Mithali Raj (@M_Raj03) December 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you Paltan. 👍 https://t.co/ZA7dYDEfTG
— Mithali Raj (@M_Raj03) December 3, 2023Thank you Paltan. 👍 https://t.co/ZA7dYDEfTG
— Mithali Raj (@M_Raj03) December 3, 2023
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Cricketer Mithali raj inaugurated Tournament : క్రీడోత్సవాలను ప్రారంభించిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్