ETV Bharat / sports

మంధాన, భాటియా భళా.. మళ్లీ పడిపోయిన మిథాలీ - వన్డే మహిళల ర్యాంకులు

Women ODI rankings: ప్రపంచకప్​లో ఆకట్టుకుంటున్న స్మృతి మంధాన, యస్తికా భాటియా.. వన్డే ర్యాంకింగ్స్​లో జోరు కనబర్చారు. భాటియా 8 స్థానాలు ఎగబాకగా.. మంధాన ఓ స్థానం మెరుగుపడింది. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో డకౌట్ అయిన కెప్టెన్.. ప్రస్తుతం ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

ODI RANKINGS WOMEN
ODI RANKINGS WOMEN
author img

By

Published : Mar 23, 2022, 12:58 PM IST

Women ODI rankings: భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, యాస్తికా భాటియా అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్​లో మెరుగయ్యారు. ప్రపంచ కప్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్న వీరిరువురు వరుసగా 10, 39వ స్థానాల్లో నిలిచారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్​లపై వరుస అర్ధశతకాలు బాదిన భాటియా.. 8 స్థానాలు ఎగబాకింది. మంధాన ఒక స్థానం మెరుగైంది. సారథి మిథాలీ రాజ్ మాత్రం ర్యాంకింగ్స్​లో పడిపోయింది. గడిచిన రెండు వారాల్లో ఐదు స్థానాలు కోల్పోయిన మిథాలీ.. తాజాగా మరో ర్యాంకు దిగజారింది. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో డకౌట్ అయిన కెప్టెన్.. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

India women cricketers ODI rankings: బౌలింగ్ విభాగంలో పూజా వస్త్రాకర్ 13 స్థానాలు ఎగబాకింది. ప్రస్తుతం 56వ ర్యాంకులో ఉంది. వెటరన్ ప్లేయర్ జులన్ గోస్వామి ఏడో స్థానానికి పడిపోయింది. ఆల్​రౌండర్ల ర్యాంకులో మాత్రం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. గత రెండు మ్యాచుల్లో జట్టులో తుదిస్థానం దక్కించుకోలేకపోయిన దీప్తి శర్మ.. ఆల్​రౌండర్ల జాబితాలో ఏడో స్థానానికి పడిపోయింది.

ఆస్ట్రేలియాకు చెందిన అలిసా హేలీ వన్డే ర్యాంకుల్లో నెంబర్.1గా కొనసాగుతోంది. బెత్ మూనీ, లారా వోల్వార్​డ్ట్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ.. బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టుకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జెస్ జొనసెన్ రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చదవండి: స్టార్ క్రికెటర్​పై వేటు.. రెండు మ్యాచ్​ల నిషేధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.