భారత్ వేదికగా జరుగుతోన్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెకెండ్ సీజన్ ఉత్కంఠ భరితంగా జరుగుతోంది. టీ20ల్లో సెంచరీ చూడడమే అరుదు అనుకుంటే.. ఒక్కో మ్యాచ్‌లో రెండేసి సెంచరీలు కూడా నమోదవుతున్నాయి. వయసు మళ్ళినా మాజీ క్రికెటర్లు మాత్రం తమలో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఆస్ట్రేలియా మాజీ బౌలర్ మిచెల్ జాన్సన్‌కు ఓ వింత అనుభవం ఎదురైంది. ఈ ఈవెంట్‌లో ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడి గదిలో ఓ పాము ప్రత్యక్షమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను జాన్సన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. "ఇది ఎలాంటి పాము? ఎవరికైనా తెలుసా ?" అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు.
మిచెల్ జాన్సన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే.. ఆ జట్టు తొలి మ్యాచులో గుజరాత్ జెయింట్స్ చేతిలో ఓటమి పాలై, రెండో మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. క్యాపిటల్స్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 21న లక్నో వేదికగా జరగనుంది. ఇప్పటికే.. ఆటగాళ్లందరూ లక్నో చేరుకొని వారి వారి హోటల్ గదుల్లో సేద తీరుతున్నారు. ఈ తరుణంలో మిచెల్ జాన్సన్ హోటల్ గదిలో పాము కలకలం సృష్టించింది.
ఇదీ చూడండి: కోహ్లీతో అంత ఈజీ కాదు: ఆసీస్ కెప్టెన్