జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడు కానున్నట్లు బీసీసీఐ ఆదివారం తెలిపింది. అంతకుముందు ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. ఇటీవల టీమ్ఇండియా కోచ్ బాధ్యతలు స్వీకరించడం వల్ల ఈ పోస్ట్ ఖాళీ అయింది.
వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటర్‌గా సేవలందించి.. ఇటీవల వైదొలిగాడు. కామెంటరీ ప్యానెల్‌లోనూ లక్ష్మణ్ సభ్యుడిగా లేడు.
డిసెంబరు 4న జరగనున్న బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో లక్ష్మణ్‌కు ఎన్సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు అందించనున్నట్లు సమాచారం.
ఇదివరకే వీవీఎస్ లక్ష్మణ్‌కు ఎన్సీఏ అధినేతగా.. అవకాశం వచ్చింది. కానీ బెంగళూరులో 200 రోజులు ఉండాల్సి వస్తుందని ఆయన ఆ పదవిని నిరాకరించారు. భారత్‌లో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు.. మాజీ క్రికెటర్లను భాగస్వాములు చేసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ డైరెక్టర్‌గానే కాకుండా అండర్-19, భారత్ ఏ టీంలపైనా దృష్టిపెట్టనున్నాడు లక్ష్మణ్.
ఇదీ చూడండి: టీమ్ఇండియా కోచ్‌గా ద్రవిడ్.. దాదా ఏమన్నారంటే?