ETV Bharat / sports

రహానె, పుజారా భవితవ్యం.. కోహ్లీ ఏమన్నాడంటే? - పుజారా టెస్టు కెరీర్​

Kohli on pujara, Rahane: కొంతకాలంగా ఫామ్​ కోల్పోయి పరుగలు చేయడానికి ఇబ్బంది పడుతున్న పుజారా, రహానె.. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్​లోనూ విఫలమయ్యారు. దీంతో వారి టెస్టు కెరీర్​ ఆగమ్యగోచరంగా మారింది. ఇకపై వారి స్థానాల్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రొటీస్​ జట్టుతో జరిగిన మూడో మ్యాచ్​ అనంతరం వారి భవితవ్యం గురించి కెప్టెన్​ కోహ్లీ మాట్లాడిన మాటలు కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది.

kohli rahane
పుజారా రహానె
author img

By

Published : Jan 15, 2022, 1:48 PM IST

Kohli on pujara, Rahane: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్​లో విఫలమైన పుజారా, రహానె ఇకపై టెస్టులో కొనసాగే సూచనలు కనిపించడం లేదు. వారిపై​ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు మ్యాచుల ఈ సిరీస్​లోని ఆరు ఇన్నింగ్స్​లో కలిపి పుజారా(124), రహానె(136) పరుగులు మాత్రమే చేశారు. దీంతో వీరిద్దరి కెరీర్​ ముగిసిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

నిజానికి టీమ్​ఇండియా టెస్టు జట్టు విదేశాల్లో గత మూడేళ్లుగా విజయాల్ని సాధించడంలో రహానె, పుజారా కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ కొంతకాలంగా వీరు ఫామ్​ కోల్పోవడం వల్ల జట్టుకు భారం అయ్యారు. ఇక రహానె కోసం అరంగేట్ర మ్యాచులోనే శతకం బాదిన శ్రేయస్​ అయ్యర్​ను పక్కనపెట్టింది టీమ్​ఇండియా మేనేజ్​మెంట్​. మరోవైపు పుజారా స్థానం కోసం సూర్యకుమార్​ యాదవ్​ ఎదురుచూస్తున్నాడు. కానీ పుజారా, రహానెపై నమ్మకం ఉంచి దక్షిణాఫ్రికా సిరీస్​లో అవకాశం ఇచ్చారు. కానీ వారు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీంతో అభిమానులు కూడా సోషల్​మీడిాయ వేదికగా వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మూడో టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. "టెస్టు క్రికెట్​లో టీమ్​ఇండియాకు పుజారా, రహానె ఎంతో చేశారు. కాబట్టి ఇకపై కూడా వారికి మా మద్దతు ఉంటుంది. కానీ.. సెలక్టర్లు తీసుకోబోయే నిర్ణయం గురించి మాత్రం నేను ఇక్కడ మాట్లాడను" అని అన్నాడు.

ఇదీ చూడండి: WTC points table: టాప్​-5లోకి దక్షిణాఫ్రికా.. టీమ్​ఇండియా స్థానం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.