మనుషులను పోలిన మనుషులు అప్పుడప్పుడు తారస పడుతూనే ఉంటారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలను పోలిన ముఖాలతోను ఉంటారు. తాజాగా మరోసారి టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీకి అలాంటి అనుభవమే ఎదురైంది. విరాట్ కోహ్లీ పుమాకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అచ్చం విరాట్ పోలికలతో ఉన్న ఓ వ్యక్తి తనలా షార్ట్, టీషర్ట్ వేసుకొని పుమా ప్రొడక్ట్స్ అమ్మాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన వాళ్లతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించాడు.
ఇది గమనించిన కోహ్లీ పుమాను హెచ్చరించాడు! ''హే పుమా ఇండియా. అచ్చం నన్ను పోలిన ఒక వ్యక్తి ముంబయిలోని లింక్‌రోడ్డు దగ్గర పుమా ప్రొడక్ట్స్ అమ్ముతున్నాడు. దయచేసి ఈ విషయంపై కాస్త దృష్టి పెట్టండి'' అంటూ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి పుమా కంపెనీకి ట్యాగ్ చేశాడు.
అయితే బ్లాక్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగానే పుమా కంపెనీ స్వయంగా ఇదంతా ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ విషయం కోహ్లీకి తెలిసే ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి: రోహిత్ ఆ లీగ్ ఆడటం మానేస్తే బాగుపడతావ్!: చిన్ననాటి కోచ్ కీలక వ్యాఖ్యలు