Kohli Centuries In 2023 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. తన 2.0లో విశ్వరూపం చూపిస్తున్నాడు(virat kohli 2.0). 2019-2022 వరకు సెంచరీలు లేక గడ్డుకాలం ఎదుర్కొన్న అతడు.. 2022 సెప్టెంబర్‌లో ఆసియా కప్ టీ20 ఫార్మాట్ అప్ఘానిస్థాన్‌పై సెంచరీ బాది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. తిరిగి తన శతకబాట పట్టాడు. కెరీర్‌లో 71 శతకం కోసం మూడేళ్ల పాటు నిరీక్షించిన ఈ కింగ్.. ఆ తర్వాత సెంచరీ సెంచరీల దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం అతడు 77 శతకాలు బాదాడు(తాజాగా పాకిస్థాన్ మ్యాచ్‌పై 77వ శతకం).
మూడేళ్లకాలంలో ఒక్క శతకం కూడా చేయలేని కోహ్లీని చూసి.. ఇక కెరీర్ అయిపోందిలే అనుకున్నారంతా. కానీ విరాట్.. ఆ తర్వాత సరిగ్గా ఏడాది వ్యవధిలోనే ఏడు శతకాలు బాది మునుపటి కన్నా ప్రమాదకరంగా మారుతున్నాడు. ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే ప్రపంచ బౌలర్లు.. కోహ్లీ 2.0ను ఎదుర్కోవడం కష్టమే అనిపిస్తోంది. అప్ఘానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత అదే ఏడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో మరో శతకం బాది 2022ను రెండు శతకాలతో ముగించాడు. ఇక 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 21 ఇన్నింగ్స్‌ల్లో 58.42 యావరేజ్‌తో 5 శతకాలు, 2 అర్ధ శతకాల సాయంతో 1110 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.
Virat Kohli ODI World Cup 2023 : వన్డే వరల్డ్‌కప్‌కు ముందు విరాట్ ఈ రేంజ్లో ఫామ్‌లో ఉండటాన్ని చూసి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మేటి జట్లు కూడా ఎంతో జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విరాట్ దూకుడుకు బ్రేకులు వేయాలంటే వారు ఇప్పటికే ఎత్తుగడలు సిద్ధం చేసి ఉండాలి. లేదంటే కోహ్లీ ఫామ్ దెబ్బకు చిత్తైపోవాల్సిందే. ఇక కోహ్లీకి ఫామ్‌కు ఇతర ప్లేయర సహకారం కూడా అందితే.. భారత్ ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి కోహ్లీ రాబోయే వన్డే వరల్డ్ కప్‌లో, ఈ ఏడాది ముగిసేలోగా ఎన్ని శతకాలు బాదుతాడో..
-
13000 ODI runs and counting for 👑 Kohli
— BCCI (@BCCI) September 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
">13000 ODI runs and counting for 👑 Kohli
— BCCI (@BCCI) September 11, 2023
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn13000 ODI runs and counting for 👑 Kohli
— BCCI (@BCCI) September 11, 2023
He also brings up his 47th ODI CENTURY 👏👏#TeamIndia pic.twitter.com/ePKxTWUTzn
Kohli Centuries : కింగ్ కోహ్లీ ఎప్పుడూ నెం.1.. ఏడాది కాలంలో 7 రికార్డ్ సెంచరీలు
Asia Cup 2023 IND VS PAK : కోహ్లీ-కేఎల్ రాహుల్ సెంచరీ.. పాకిస్థాన్ ముందు భారీ లక్ష్యం..