ETV Bharat / sports

కోహ్లీ సరికొత్త రికార్డు.. వేగవంతమైన బ్యాట్స్​మన్​గా ఆ ఘనత

author img

By

Published : Sep 2, 2021, 5:38 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ తన ఖాతాలో మరో రికార్డు జోడించాడు. అంతర్జాతీయ క్రికెట్​లో 23 వేల పరుగులు సాధించిన వేగవంతమైన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. కేవలం 490 ఇన్నింగ్స్​ల్లో ఈ మార్క్​ను అందుకోవడం విశేషం.

Kohli record
కోహ్లీ

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి 23 వేల పరుగులు సాధించిన వేగవంతమైన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. 490 ఇన్నింగ్స్​ల్లో ఈ మార్క్​ను చేరుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ ఘనత నమోదు చేశాడు.

Kohli Fastest cricketer to reach 23000 international runs
కోహ్లీ 23 వేల పరుగుల మార్క్

అంతకుముందు సచిన్​ తెందుల్కర్​(522), రికీపాంటింగ్​(ఆస్ట్రేలియా, 544), జాక్వెస్​ కల్లీస్​(దక్షిణాఫ్రికా, 551), కుమార్​ సంగక్కర(శ్రీలంక, 568), రాహుల్​ ద్రవిడ్​(టీమ్​ఇండియా, 576), ఎమ్​ జయవర్దనె(శ్రీలంక, 645) ఇన్నింగ్స్​లో ఈ ఫీట్​ను అందుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.